అదృష్టం ఓడినచోట ఆత్మ విశ్వాసం గెలిపిస్తుంది

 🚩 అదృష్టం ఓడినచోట ఆత్మ విశ్వాసం గెలిపిస్తుంది 

ఒక చోట అంతర్జాతీయ రన్నింగ్ కాంపిటీషన్ జరుగు తున్నది 

రన్నర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు 

గన్ పేల్చారు. 

పరుగు మొదలైంది. 

ఎలాగైనా గెలవాలి అని అందరు పరిగెడుతుంటే ఒకడు మాత్రం ప్రాణం పోయినా ఫరవా లేదు అని పరిగెడు తున్నాడు 

( కారణం ఇది వాడికి చివరి అవకాశం ) 

 

గమ్యం చేరువలో ఉంది 

 

🌴ఊపిరిని బిగబట్టి మరీ అతడు అందరి కన్నా వేగంగా పరిగెడు తున్నాడు. 

👁అందరి కళ్ళు అతడి గెలుపు కోసమే చూస్తున్నాయి.. 

 

జనాలలో ఒకటే ఉత్కంఠత ఇంకో పది మీటర్లు దాటితే అతనే విజేత... 

అంతే.. 

 

కాలు స్లిపై అతడు కింద పడి పోయాడు 

(కింద షూ సోల్ తెగిపోయింది) ఓడిపోయాడు.. 

 

(ఒక క్షణం ఆగండి.. ఆ తరువాత అతడు ఏం చేసుంటాడో ఊహించుకొండి..) 

ఇప్పుడు మీరు ఊహించుకున్న దంతా తప్పు.. 

 

తను ఓడిపోడానికి నాణ్యత లేని 'షూ'నే కారణం అని తెలుసు కొని తనకు ఎదురైన పరిస్థితి ఇంకెవరికి జరక్కుండా ఉండాలని అతనే ఒక 'షూ' కంపెనీ స్దాపించాడు..•• 

 

ఇప్పుడు ఆ కంపెని ప్రపంచంలో గొప్ప 'షూ' కంపెనీల జాబితాలో చేరిపోయింది... 

('షూ' కంపెనీ Nike) 

ఓడిపోయిన ప్రతిసారి మనం గుర్తు పెట్టుకోవలసిన మాటలు.. 

'ఓటమి ఎప్పుడు ఒంటరిగా రాదు... 

అద్భుతమైన అవకాశాలను వెంటపెట్టుకుని మరీ వస్తుంది'... 

 

నిరాశ, నిస్పృహలతో ఉన్న మనం వాటిని గుర్తించలేక పోతున్నాం... 

 

అలాంటి సమయంలోనే మనం ఓడిపోతామనే భయాన్నీ ఉరి తీయాలి, 

కొల్పోయమనే దుఃఖాన్ని కాల్చి పారేయాలి, 

కుంగిపోకుండా నిరాశకు తల కొరివి పెట్టాలి... 

⛳️ఏదైనా మొదలు పెట్టేటప్పుడు చివరి మెట్టు చూస్తే భయమే కలుగుతుంది. 

🦋న ముందు మెట్టు మాత్రమే చూస్కుంటూ ఎక్కు  

ఏదో రోజు వెనక్కి తిరిగి చూస్తే ప్రతీ మెట్టు మీద రక్తపు మరకలు కనపడ తాయి... 

✍️ఆ రక్తం నీది కాదు, నీ కాళ్ళ కింద నలిగిపోయిన కష్టాలవి...!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది