🙏ఎదుటివారి లోపాలు - గుణాలు ఎంతవరకు మనం పట్టించుకోవచ్చ
మనం ప్రతివారిలో , ఎదో ఒక లోపం చూసి, వారిని వ్యతిరేకించడం అలవాటు, లేదా లేని లోపాన్ని తగిలించి విమర్శించడం మన గ్రహాపాటు... అది వారి ప్రారబ్ధం అని అర్థం చేసుకునే జ్ఞానం మనలో లేదని దాని అర్థం...
భగవంతుడు ఎంతో దూరదృష్టి కలిగినవాడు కనుకనే ఎలాంటి కర్కోటకుడికయినా ఏదో ఒక సుగుణాన్ని ప్రసాదించి తద్వారా వారికి ఎనలేని కీర్తి కలిగేలా దీవిస్తాడు...
అది తెలుసుకోవడం చాలా కష్టం...
*ఉదాహరణకు ...*
_రాక్షసులకు ఉన్నంత దీక్ష, పట్టుదల దేవతలలో కనిపించవు, అందుకే దేవతలు రాక్షసుల ముందు తలవంచ వలసి వచ్చేది..._
_తామనుకున్న కార్యం సాధించే వరకూ సకల దుఃఖాలనూ చివరకు ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి తపస్సు చేసి, అసాధారణ వరాలు పొందగలిగిన రాక్షసులు తమకున్న ఓర్పు, పట్టుదల అనే సుగుణాలతో దైవాన్ని కూడా వశపరచుకోగలిగారు..._
మహాబలి దాతృత్వం ముందు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే వామనుడై చేయి సాచాడు,
పది తలల రావణాసురుని భక్తి ముందు కైలాసనాథుడే ఆత్మలింగమై చేతికి చిక్కాడు,
దుర్యోధనుని స్నేహధర్మం ముందు అతడెంత దుర్మార్గుడైనా, శ్రీకృష్ణుడంతటి వాడిని కూడా నిర్లక్ష్యం చేసి, తన సర్వస్వాన్ని అతని పాదాక్రాంతం చేశాడు కర్ణుడు...
వీరంతా ఎంతటి కర్కోటకులైనా, లోకకంటకులైనా, వారిలోని ఒక్క మంచి గుణంతో చరిత్రలో శాశ్వత కీర్తిని పొందగలిగారు...
*ఎవరి అనుగ్రహం ఎలా వుంటుందో మనకు తెలియదు, అందుకే ఎవరి లోపాలు, గుణాలు లెక్కపెట్టి వారిని విమర్శించడం తగదు...*
Key Words : Telugu WhatsApp