"ఎంతకాలం అలా చూస్తూ కుర్చుంటావ్
మది తలపులకు తాళం వేసి
సందులోంచి ఎందుకలా దొంగలా తొంగిచూస్తావ్
వెలుగే రాని చీకటి లోయలో
నల్లటి దుప్పటి కప్పుకుని
ఎందుకలా దాక్కొని నక్కినక్కి చుస్తుంటావ్
చీకటిని చూసి భయపడి నువ్ కండ్లు మూసుకొన్నావో అదీ మెల్లిగా నీ గుండెల్లో చేరి నిన్ను శాశ్వతంగా నిద్రలో ముంచుతుంది
ఒక్కసారి బయటికి రా...
వణికే చేతివ్రేళ్ళను అలాగే బిగపట్టి
పిడికిలెత్తి పైకి లే..
తడబడే పెదవులని పంటి కిందా అదిమిపట్టి
తల పైకి ఎత్తి చూడు ..
జీవితం అంటే పిరికితనం కాదు, పోరాటం ..
కడుపులో ఆకలి ఎలాగో మన ప్రయత్నం అలాగే,
ఎదురయ్యే ఓటములే మనకు ఆయుధాలు,
కండ్లల్లో ధైర్యం వుండి, గుండెల్లో బలం వుంటే చాలు
ఎంతటి వాడ్నైనా గెలవచ్చు ,
రాజ్యలనైనా యేలవచ్చు
గెలవలంటే పోరడు ,
భయపడితే చావు..