ఫజిల్:
నేను ఆదివారం రోజు ఫ్రెండ్ ని కలవటానికి సిటీకి వచ్చా . అతని కొరకు ఎదురుచూస్తూ ఉన్న టైం లో ఎదురుగా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉన్నది, ఫ్రెండ్ లేట్ అయ్యిద్దని చెప్పటంతో ఎగ్జిబిషన్ చూద్దామని వెళ్ళా,ఎంట్రాన్స్ వద్ద 50 రూ, లు ఇచ్చేసి లోపలకి వెళ్ళా,,,,
లోపల తిరుగుతూ ఒక గేమ్ వద్ద ఆగి ఆ గేమ్ లో నా జేబులో ఉన్న డబ్బులు మొత్తం పెట్టా .,
గేమ్ గెలిచాను నా డబ్బు రెట్టింపు అయ్యింది .
ఆ డబ్బు తీసుకొని బయటకు వెళ్దామని ఎంట్రాన్స్ వద్దకు వచ్చా,,,,బయటకు వెళ్ళుటకూ 50 రూ,,,తీసుకున్నారు .,,,
నేను బయట వెయిట్ చేస్తుండగా ఫ్రెండ్ కాల్ చేసి ఇంకా లేట్ అవుద్దని చెప్పాడు ,
మరలా 50 రూ, ఇచ్చి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి నేరుగా గేమ్ దగ్గరకు వెళ్ళా ,,,
మరలా గేమ్ లో నా జేబులో ఉన్న డబ్బు మొత్తం పెట్టి గేమ్ గెలిచా,,
నా వద్ద ఉన్న డబ్బు మరలా రెట్టింపు అయ్యింది ,,నేను సంతోషంగా గేట్ వద్దకు వచ్చి 50 రూ, ఇచ్చి బయటకు వచ్చా,,,,,,,,,,,
,తరువాత నా జేబు చూస్తే ,,,ఆశ్చర్యం ఏం డబ్బు లు లేవు, ,,,,అసలు మొదట ఎగ్జిబిషన్ కి వెళ్ళుటకు ముందు నా జేబులో ఉన్న డబ్బు ఎంత ?