ప్రస్తుత సమాజంలో కొంత మందికోసం

ప్రస్తుత సమాజంలో కొంత మందికోసం

నీ మనస్సాక్షికి  మాత్రం తప్పక జవాబుదారుడికి..

మన చేసే పాడుపనులన్ని మంచివే అనుకుంటూ పోతే కాలమే నిర్ణయిస్తుంది శిక్షను..

నిన్ను విమర్శించే వాడికల్ల వివరణలు ఇచ్చుకుంటూ పోతే ..నీవు అక్కడే ఉంటావ్​..విమర్శలు సమీక్షించుకోవాలి అంతే..

పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు..

నీపై విమర్శలు వస్తున్నాయంటే..నీవు పనిచేస్తున్నవన్న మాట..ఎదుగుతున్నవన్న మాట..

కానీ చేసే పనిలో నిబద్దత లేకపోయిన..మేజార్టీ ప్రజలను మెప్పించలేకపోయిన..నీవు చేస్తున్న కార్యంలో ఎక్కడో లోపం ఉందన్న విషయం గుర్తించాలి..

ఎవరికి సమాధానం చెప్పకున్న పర్వాలేదు కానీ.. నీ మనస్సాక్షికైన సమాధానం చెప్పుకోవాలి.. సమీక్షించుకోవాలి.. 

నీవు చేస్తున్నది ఒప్పు అని నీ మనస్సు నమ్మితే చాలు..ఎవడితో పనిలేదు..ప్రతి అడ్డమైన వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. నిన్ను నమ్ముకున్న వారికి..నిన్ను ప్రేమించే వారికి..మాత్రం కొన్ని సందర్బాల్లో వివరణలు..సవరణలు అవసరం..

చేసే పనిలో నీతి, నిజాయితి, నిబద్దత ఉంటే.. గెలుపు,ఓటములను కాలమే నిర్ణయిస్తుంది..

ఉన్నోన్ని కొట్టి లేనోనికి పెడితే ఓ సిద్దాంతం ప్రకారం పర్వాలేదు కానీ.. పేదొని  కడుపు కొట్టి..బంగ్లాలు కట్టి..ప్రజల రక్తం తాగి..కోట్లు కూడకడితే..ఆ సోమ్ము నిలవదు.. నీ కుటుంబానికి కూడా శ్రేయస్కారం కాదు..




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది