*నేటి వార్తలు (06.02.2021)*
*పుష్య మాసం నవమి శనివారం*
సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు *ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జయంతి*
రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త *విలియం పి. మర్ఫీ జయంతి*
శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు *సూరి భగవంతం వర్ధంతి*
భారత జాతీయ నాయకుడు *మోతిలాల్ నెహ్రూ వర్ధంతి*
దేశంలో గడచిన 24గంటల్లో 12,408 కరోనా పాజిటివ్ కేసులు,120 మంది మృతి
నేపాల్- భారత్ సరిహద్దుల్లోని సిక్కింలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైనట్లు జాతీయ సిస్మాలజీ కేంద్రం అధికారులు వెల్లడించారు
ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ ఉగ్రమూకలు దాడి.. 16మంది సైనికులు మృతి
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సినిమా థియేటర్లలో వందశాతం కెపాసిటీకి అనుమతి
తెలంగాణ బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో మూడో వంతు రైతుల కోసమే ఖర్చు చేస్తున్నామని హరీష్‌రావు వెల్లడించారు.
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులను రెచ్చగొడుతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు
డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. రిమోట్ ప్రాంతాలపై ఫోకస్
ఎంసెట్ విద్యార్థలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు. ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ యథాతథంగా కొనసాగింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్.. దారి తప్పిన ఓ వ్యక్తికి తానే దిక్కయ్యాడు.. ఆకలి తీర్చి.. గమ్యం చేర్చాడు
ముంబైలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
ఈనెల 11న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు పరిశీలకుడి నియామకం
30 ఏళ్లలోపు వేర్వేరు రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ.. రాణించిన 30 మంది జాబితాను ఏటా ఫోర్బ్స్ ప్రకటిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన కీర్తి రెడ్డి కొత్త(24)కి చోటు దక్కింది.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పోరాటం తీవ్రమైంది. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పు నిప్పుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కటవుతున్నారు.
పుదుచ్చేరిలోని ఆర్యన్‌కుప్పం గ్రామానికి చెందిన సత్యానందం (43) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి.. తనకు రూ.5కోట్లు ఇస్తే ప్రధాని మోదీని చంపుతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిని ఓ ట్యాక్సి డ్రైవర్ గుర్తించి గురువారం పోలీసులకు సమాచారం అందించాడు.అనంతరం సత్యానందం ఫేస్‌బుక్ అకౌంట్‌ను ట్రేస్ చేసిన పోలీసులు పుదుచ్చేరికి సమీపంలో శుక్రవారం అతన్ని పట్టుకొని విచారిస్తున్నారు
2021 ఆస్కార్ బరిలో నిలిచిన బాలీవుడ్ లఘు చిత్రం.. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైన ‘నట్కాట్’
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,249 గ్రామపంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 517 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. ప్రాజెక్టులు, చీఫ్ ఇంజనీర్ల వారీగా చేపట్టాల్సిన పనులు, వాటికి జరపాల్సిన కేటాయింపులపై చర్చ జరిగింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శనివారం తలపెట్టిన చక్కాజామ్‌పై టెన్షన్ వాతావరణం నెలకొంది. రిపబ్లిక్ డే నాడు జరిగిన ఘటనలు రిపీట్ కాకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వయంగా పరిస్థితిని సమీక్షించారు.