చాలామంది సమయం లేదని బాదపడుతూ వుంటారు కదా...
మనం ఉదయం లేచే సమయం కన్నా ఒక గంట ముందుగా ఎందుకు లేవకూడదు అలా చెయ్యడంవల్ల ఒక వారానికి మనకు 7 గంటల సమయం ... ఒక నెలకు 30 గంటల సమయం అలాగే ఒక సంవత్సరంలో దాదాపుగా 15 రోజులు మనకు అదనంగా లభిస్తాయి ... ఈ 15 రోజులను మనం మనకుటుంబం వారికి మరియు ఇతర కార్యాలకు కేటాయించవచ్చు కదా... ఆలోచించండి !
ఇంకో విషయం ..
చాలామంది ఎక్కువగా నిద్రకోసం కేటాయిస్తుంటారు .... నిద్ర మనకు అవసరం కాని ఎక్కువ నిద్ర పోవడంవల్ల మనజీవితంలో చాలా కోల్పోతాము .... ఎలాగో చనిపోయినతరువాత మనకు పూర్తిగా విశ్రాంతే కదా... ఉన్నప్పుడైన ప్రపంచాన్ని చూద్దాం .... మనం పుట్టగానే మనతోపాటుగా మన మృత్యువు కూడా పుట్టిందని గ్రహించండి ... అది ఎప్పుడు మన వెనకే ఉంటుందని గుర్తించండి.... మనం వున్నప్పుడు ఇలా నిద్రకోసం, కబుర్లు చెప్పుకోవడం కోసం, గొడవలు పడటంకోసం, ఇతరులను ఇబ్బంది పెట్టడంకోసం, ఇలా చాలా సమయం వృధా చేస్తున్నాం మనకు తెలియకుండానే .... ఇలా చేస్తూ పోతే నిన్ను ఈ ప్రపంచం గుర్తించదు ... ప్రపంచం గుర్తించాలంటే నువ్వు ఏంటో చూపించాలి .. అది చెయ్యాలంటే నీకు తగినంత సమయం కావాలి ... ఏమంటావ్ ??
ఈ లోకంలో లేనోడికి ఒక విలువ, వున్నోడికి ఒక విలువ వుంది. కాని ఎలాంటి తేడాలు చూపించకుండా కేవలం మనిషిని మాత్రమే గుర్తించేది ఏమిటో తెలుసా ??
స్మశానం మాత్రమే...
అక్కడ నువ్వు డబ్బుగల్లోడివా, లేనోడివా, నువ్వు చదువుకున్నావా, లేదా అనే తారతమ్య భేదాలు వుండవు ... నీ దేహం పక్కనే ఒక పెద్ద ఆఫీసర్ దేహం కూడా ఉండొచ్చు కదా ... అందుకే మనం స్మశానం ని చూసి చాలా నేర్చుకోవాలి .. ఎప్పటికైనా దానికి బాకీ వున్నోళ్ళం కదా ... బతికి ఉన్నప్పుడే ఏదైనా సాధించండి ... మృత్యువు ఎదురుపడినప్పుడు సంతోషంతో, గర్వంతో మీసం మెలేస్తూ దాని వడిలోకి చేరండి.... అంతే కాని ఏది సాధించకుండా మృత్యువు ఎదురుపడినప్పుడు భయంతోనూ, బాదతోను వెళ్ళకండి ... అలా చేస్తే జంతువులకు మనకి పెద్ద తేడా ఏది వుండదు కదా...
ఇది చూసి మీలో ఒక్కరైనా గ్రహిస్తారనే నమ్మకంతో పోస్ట్ చేస్తున్నాను ...
🙏😊 స్వస్తి 🙏😊