ఇంట్లో నిత్య పూజలు ఎలా చేయాలి?
#పంచోపచారపూజలుఅంటేఏమిటి?
మనము హిందువులం మన ఇంటిలో దైవారాధన, ఇష్టదేవత, లేదా కులదైవత ఆరాధన నిత్యం చేయాలి!!
ఈ ప్రపంచం #పంచభూతముల(భూమి,జలం
అగ్ని,వాయు,ఆకాశముల)చే నిర్మితమైనది!! పంచభూతముల పంచీకృతం వలన ఏర్పడినది కావున దీనిని #ప్రపంచం" అని
పిలుస్తారు!!
#మనదేహం(శరీరం) పాంచభౌతికమైనది!!
#మనగేహం(గృహం) పాంచభౌతికమైనది!!
దేహం - గేహంలో (ఇల్లు) కాపురముంటుంది!!
#ఆత్మచైతన్యం లేనినాడు చివరికి ఈ దేహం పంచభూతాలలో కలసిపోతుంది!!
ఆ భగవంతుడు మనకు దేహాన్ని(శరీరం) గేహాన్ని(ఇల్లు) ఇచ్చి పంచ జ్ఞానేంద్రియాలను
పంచకర్మేంద్రియాలను ఇచ్చి ఈ లోకంలో నాలుగు కాలాల పాటు వుండటానికి అనుగ్రహాన్ని ప్రసాదించాడు!!
మరి ఆయనకు కృతజ్ఞత తెలియజేయటం
మన కనీస విధికదా!! కర్తవ్యం కూడా!!
కావున ప్రతి హిందువు కుటుంబంలో నిత్యము దేవతారాధన జరుగాలి!!
నిత్య దీపారాధనతో పాటు ధూప దీప నైవేద్యాలను భగవంతునికి సమర్పణ చేసి
అర్చించాలి!! స్తోత్రములు కాని ధ్యానశ్లోకము
కానీ లేదా మంత్రమో పారాయణమో ఏదో
ఒకటి మీకు వచ్చినది, మీకున్న సమయాన్ని బట్టి చేయండి!!
#హిందూధర్మంబలవంతంగాదేనినిరుద్దదు!
గంటలు గంటలు అవసరం లేదు !! పది లేదా
ఇరవై నిమిషాల్లో పూర్తి చేయవచ్చు!!
హంగులు ఆర్భాటాలు కాకుండా #భావన"
#భక్తి" - #శ్రద్ధ"లు ముఖ్యం!!
పూజగది వున్న ఇంటిలో స్నానం చేసి శుచి
శుభ్రతలను పాటించి పూజాకార్యక్రమాన్ని
చేసుకోవాలి!! పూజగది లేనివారు దేవతా
చిత్రాలను పెట్టుకున్న సెల్ఫ కానీ బల్ల పై కానీ
పూజ చేసుకోవచ్చు!!
సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానాదులను పూర్తి చేసుకుని ఇంటి ఇల్లాలు
లేదా ఎవరైనా దీపారాధన చేసి పంచపూజలు
చేయాలి!! ఆ తరువాతనే వంటచేసుకోవాలి!!
ప్రతి హిందువు కుటుంబంలో #ఉదయసంధ్య #సాయంసంధ్య లలో రెండుపూటలు దీపారాధన చేయండి!!
నిత్యం పంచోపచార పూజలు చేయండి!!
తులసికోటలో తులసి పూజ చేయండి!!
"#తూర్పుకుతిరిగిదండంపెట్టండి " !! అంటే
ఏమిటి ?? ఈ సామెతకు అంతరార్థం??
ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణు నికి
నిత్యం కనీసం " నమస్కారము" చేయండి!!
#పంచపూజలు అంటే ఏమిటి??
ఉదాహారణ:- లక్ష్మీనారాయణ పూజ
1- ' లం' #పృధ్వీ" తత్త్వాత్మికాయ శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః!! 'గంధం' సమర్పయామి!!అని స్వామికి గంధాన్ని పసుపు కుంకుమలనుసమర్పణ చేయండి!!
2- 'హం' "#ఆకాశ" తత్త్వాత్మికాయ శ్రీ లక్ష్మీ
నారాయణాయ నమః ' పుష్పం" సమర్పయామి!! అని స్వామివారికి పుష్పాలను సమర్పణ చేయండి!!
3- 'యం' #వాయు" తత్త్వాత్మికాయ శ్రీ లక్ష్మీ
నారాయణాయ నమః ' ధూపం' సమర్పయామి!! అని స్వామి వారికి అగరువత్తులు వెలిగించి ధూపాన్ని సమర్పణ చేయండి!!
4- 'రం' #అగ్ని" తత్త్వాత్మికాయ శ్రీ లక్ష్మీ
నారాయణాయ నమః 'దీపం' సమర్పయామి!
అని స్వామి వారి ముందు దీపాన్ని వెలిగించి
చూయించండి! దీపానికి కుంకమ బొట్టు
పెట్టండి!!
5- ' వం' #అమృత"(జలం) తత్త్వాత్మికాయ
శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః! అమృత
నైవేద్యం నివేదయామి!!అని నైవేద్యం
నివేదన చేయండి!!
ఇలా మంత్రాలను పలుక లేని వారు భగవంతునికి ఈ #ఐదుసేవలు చేసి దండం పెట్టండి చాలు!!
మరి నైవేద్యం ఏమి పెట్టాలి??
పండు, ఫలం,పాలు, ఎండు ఫలాలు లేదా
అన్నం, పాయసం,పలిహోర లేదా అటుకులు
బెల్లం లాంటివి ఏవైనా నివేదన చేయవచ్చు!!
#గీత" లో #పత్రంపుష్పంఫలంతోయం " అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు గదా!!
కనీసం శుభ్రమైన జలాన్ని కూడా అమృతంగా
భావించి నివేదన చేయవచ్చు!!
ఇవి #పంచపూజలు" - #పంచోపచారాలు" !!
విశేషమైన దినాలలో #షోడషోపచారాలు"
అంటే 16 ఉపచారాలు చేసుకోవచ్చు!!
నిత్యం పదహారు ఉపచారాలు చేసుకునేవారు నిత్యాభిషేకాలు అర్చనలు చేసుకునే భక్తులు కూడ వున్నారు!! అది వారి వారి ఓపిక, సహనం, సమయం అనుకూలత
ననుసరించి వుంటుంది!!
ఏదీ వీలు పడనప్పుడు పరిస్థితి ప్రతికూలంగా
వున్నప్పుడు " హే భగవాన్!! నీకు ఈరోజు
"నమస్కారము" తప్ప ఏదీ సమర్పణ చేయలేక పోతున్నాను నన్ను క్షమించు స్వామి
అని ఒక నమస్కారము చేయండిచాలు" "భగవంతుని #నామస్మరణ చేయండి చాలు" స్వామి పొంగిపోతాడు!కరుణను వర్షిస్తాడు!!
#గది " లో పూజలు-అర్చనలు చేసుకున్న భగవంతుణ్ని #మది" లో నిలుపుకునే ప్రయత్నం చేయండి" !! శుభమ్-భూయాత్!!