గురు దత్త ప్రభోదం





🌺గురు దత్త ప్రభోదం 🌺

భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం స్వీకరించాలి. అగ్ని నుంచి నిర్మలత్వాన్ని, సముద్రజలం నుంచి గాంభీర్యాన్ని, కపోతం నుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలి.
అప్రయత్నంగా వచ్చే ఆహారాన్ని మాత్రమే మానవులు స్వీకరించాలి. కొండచిలువలా భ్రాంతి వలలో పడకూడదు.స్పర్శానందానికి దూరంగా ఉండటం అంటే ఏమిటో మిడతను చూసి తెలుసుకోవాలి.ఏనుగు నుంచి పట్టుదల, చేప నుంచి త్యాగచింతన అలవరచుకోవాలి. చీమలా జిహ్వచాపల్యానికి లోను కారాదు. అప్పుడే సుఖానికి మూలం అవగతమవుతుంది.
మానావమానాల్ని సమానంగా చూడటాన్ని బాలల నుంచి నేర్చుకోవాలి. వృద్ధిక్షయాలు శరీరానికే గాని ఆత్మకు కావన్న అక్షర సత్యాన్ని చంద్రుడి నుంచి గ్రహించి మసలాలి. లేడి నుంచి త్యాగనిరతిని, సాలె పురుగు నుంచి ‘సృష్టి స్థితి లయ కారకుడు పరమాత్మే’నన్న తెలివిడిని పొందాలి. ఆత్మానందం దొరికే చోట సంచరించాలని సీతాకోక చిలుక నుంచి నేర్వాలి. ఆర్తుల్ని కాపాడే పారమార్థిక చింతను జలం నుంచి సొంతం చేసుకోవాలి.
🙏జై  మహదేవ్ జై గురుదేవ్ 🙏





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది