కుక్క నుండి నేర్చుకునే విషయాలు!!






కుక్క నుండి నేర్చుకునే విషయాలు!!

1. తోటి కుక్కలతో ఎప్పుడూ గోడవపడుతుంది.
2. పనిలేకున్నా అటూ ఇటూ తిరుగుతుంది.
3. వావి వరుసలు లేని కామం.
4. లేనివి ఉన్నట్లుగా ఊహించుకుని ఏటో చూస్తూ భయంకరంగా ఏడుస్తుంది.
5. తాను నమ్మిన వారిని తప్ప అందరిని శత్రువులుగా భావించి అరుస్తుంది.
6. తొందరపాటుతో ఆబఆబగా గతుకుతూ తింటుంది.
7. పిచ్చి లేపుకుని తనకూ - ఇతరులకు ప్రమాదం తెచ్చిపెడుతుంది.
8. కుక్క తాను నమ్మినవాళ్లనే మంచివాళ్లుగా భావిస్తుంది...క్రొత్తవారిని చెడ్డవాళ్లుగా భావిస్తూ ఉంటుంది.
9. కుక్కలో.. తాను ఇష్టపడే వారిపట్ల అతిప్రేమ....ఇష్టపడని వారి పట్ల అతిద్వేషం కనిపిస్తూ ఉంటాయి.
10. కుక్కను బిస్కెట్లు పెట్టి ఆశపెట్టి లంచమిస్తే క్రమంగా మనవైపు తిప్పుకోవచ్చు!
11. కుక్క చొంగ కారుస్తూ వుంటుంది!
12. కొన్ని కుక్కలు ఏవి దొరికితే అవి తినడాన్ని అలవాటు చేసుకుంటాయి.
13.కుక్క సారం లేని చెప్పు లాటి వాటిని పీక్కు తినడానికి ఎంతో సాధన చేస్తుంది...కానీ సారమున్న చెరుకు లాంటి వైపు కన్నెత్తి కూడా చూడదు.

.....ఇవి కుక్కను చూసి "ఇలా ఉండకూడదు" అని నేర్చుకునే విషయాలు.

"శ్వానం నిద్ర బక ధ్యానం " అని నీతిశాస్రం చెప్పినట్లు....

1.అభివృద్ది చెందాలనుకునే వ్యక్తి సమయం దొరికినప్పుడు కొంచెం కొంచెంగా కుక్కలా నిద్రపోవాలట...

2. కృతజ్ఞత - లేదా ప్రేమ

ఇవి "ఇలా ఉండు " అని చెప్పే విషయాలు!!

ఇలాగే ప్రతీవ్యక్తిలోనూ రెండు పార్శ్వాలు ఉంటాయి + & ౼ లు

వాటిని చూసి రెండురకలుగా నేర్చుకుంటూనే ఉండాలి😊





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది