లక్ష్మి నరసింహ పురాణం-4





లక్ష్మి నరసింహ పురాణం-4

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ఇంకొకడు హిరణ్యకశిపుడు. వాడు నరసింహమూర్తికి బలి అయినవాడు. ఇతని చరిత్రమే ఇప్పుడు మనకి ప్రధానవిషయం. ఇది ఇలా ఉందని. ఒకప్పుడు అడిగావు  భరద్వాజా? జ్ఞాపకం ఉందా? వశిష్ఠుడు మిత్రవారునుల ప్పుత్రుడవడం. ఏమిటాకథ?అని..అది చెబుతా విను.

*మైత్రావరుణి*

       కశ్యాపుని భార్యలు పదముగ్గురనీ దారిలొ మొదటిది అదితి అనీ ఆమెకు పన్నెండుగురు కొడుకులనీ చెప్పాను.వారే ద్వాదశాదిత్యులు.వారి వల్లనే పగలూ రాత్రీ కలుగుతున్నాయి.వారిలో మిత్రుడు , వరుణుడు అని ఇద్దరు.వారికి ‌సంబందించినదే ఇప్పుడు చెప్పబోయే కథ. వరుణుడు పడమటి దిక్కుకు నాయకుడు అయినాడు.పశ్చిమ సముద్ర ప్రాంతాన ఉన్న పర్వతం  వద్దకు సూర్యుడు చేరగానే ఈయన ప్రక్కన ఉన్న జగమంతా​అంధకారబంధుర మౌతుంది.సూర్యుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు.

        ఆ పడమటి కొండ పలువిధములైన రత్నాలకాంతులతో  వెలిగే శిఖరాలు కల గొప్ప పర్వతం.అంతా బంగారుమయం.దాని గుహలు సింహశార్ధూల నివాసాలు.అచటి వృక్షాలన్నీ  అన్ని ఋతువుల్లో మధుర ఫలాలతో సంతర్పణ చేస్తు ఉంటాయి.సిధ్ధులు, గంధర్వులూ ఆ కొండ కోనల్లో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు.

   విశ్వకర్మ ఆ కొండ శిఖరాన ఒక చక్కని నగరం నిర్మించారు.రత్నాలు, బంగారం ఆ నగర నిర్మాణానికి సమ్రృధ్ధిగా వినియోగించారు.దానిపేరు విశ్వావతి. దివ్యభోగాలకు అది నెలవు.ఆ నగరం వరుణుడు నివాసం.అక్కడ ఉండి పశ్చిమ దిశను పాలించవలసిందని బ్రహ్మ వరుణున్ని నియమించారు.ఆ విధంగా  వరుణుడు లోకపాలకుడు అయినాడు. అలాఉండగా ఒకనాడు అన్నదమ్ములు మిత్రుడు,వరుణుడు భూలోకంలో వనవిహారనికి ప్రియుపడి క్రమంగా కురుక్షేత్రానికి చేరారు. వికసించిన పూ దిగలతో, ఫలవృక్షాలతో , ఋషులు శ్రుతిగోష్ఠులతో,పక్షలు




కూతలతో కళకళలాడుతున్న కురుక్షేత్రంలో , ఆ అన్నదమ్ములు ఆలా విహరిస్తో ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతో ఇంకా లోపలకు వెళ్లారు. అక్క ఒక చిన్న తామర తమకొలను దాని పేరు పౌండరీకం.  కాస్త దగ్గరగా వెళ్లారు.  చక్కగా విచ్చిన కమలాలతో , కమల పరిమళాన్ని మోసుకువచ్చి చల్లగా తాకే పిల్ల గాలులతో, కనువిందుగా ఉన్న  ఆ చెరువులో అచ్చరపోబోండ్లలో తలమానికం,అందచందాలకు పెట్టిన పేరు. ఊర్వశి చెలికత్తెలతో జలక్రీడలాడులోంది . పురుషులెవ్వరూ చుట్టుపట్ల లేరు. రారు అని ఆ రమణీమణి కోయిల గొంతుతో శృతి  కలుపుతో  శృంగారగీతాలు పేరుతో స్వేచ్ఛగా తానమాడుతోంది.  అన్నదమ్ములిద్దరు  ఆ ముద్దుగుమ్మను ఆ అవస్థలో చూచి ఆశ్చర్యానంద విభ్రమాలతో అల్లుకుపోయారు. ఊర్వశి గడసరి  పోబోడి ! శృంగార జలధికి ప్రొఢ విభ్రమ విలాసానౌక!  ఆ అన్నదమ్ముల హావభావాలు అర్థం చేసుకొని అలాగే క్రి గంటి చూపుల తోపులాట వారి హృదయాలను ఛేదించి జిలుగు పావడతో, వెళివట్టు  రైకతో తడిమేను  సర్దుకొని దరికి వచ్చి  , సెలవిప్పంచమని , పోయి వస్తానని ఒక్క చిరునవ్వు విసిరి తూనీగలాగ మింటి కెగిరిపోయింది. ఆ వగలాడి వగలకు మిత్రావరుణులు తాళలేక పోయారు. పట్టుకోవాలని మడుగు గట్టుకు వడివడిగా వెళ్ళి  చేతులు చాచారు . అది దొరుకుందా? అది ఆలాగు తుర్రున పైకి ఎగరడమేంటి, మిత్రావరుణలకు వీర్యస్థలంనం అయి పోవడమేమిటి రెప్పపాటు కాలంలో జరిగిపోయిందంతా !

        చల్లబడి అన్నదమ్ములిద్దరూ సహజస్థికి వచ్చి వెనుదిరిగిపోయారు. కురుక్షేత్రంలో అనువైన స్థలం చూచి ఆశ్రమం ఏర్పరుచుకొని ఘోర తపస్సు చేసారు . వారి తపస్సుకు పితామహుడు మెచ్చి వచ్చి మీ తపస్సుకు సంతోషించాను. ఇకలేండి మీకు వాయిష్ణవ తేజస్సిద్ధి కలిగేటట్లు వరమిఇస్తున్నాను. అదికూడా కొంతకాలం పోయాక సిద్ధిస్తుంది " అని వరమిచ్చి  అదృస్యుడైనాడు . తపసిద్ధి  సాధించిన ఆనందంతో గతం మరిచి ఆ అన్నదమ్ములిద్దరూ స్వస్థలాలకు వెళ్లిపోయారు .

       మిత్రావరుణులకు ఊర్వశీ సందర్సనమ్ వల్ల మనస్సు కరిగి పతనమైన వీర్యం  పద్మంలోను , కొలనిగట్టున , నీటిలోను పడింది. పద్మమందు పడినదే శిశువుగా మారింది . అదే వసిష్ఠుని జన్మకు కారణమైంది. బ్రహ్మ వాక్కు అది. ఆనాటికి  ఉన్న శరీరం వదిలి ఇంకొక శరీరాన్ని వసిష్ఠుడు ధరించవలసి వచ్చింది. అంటే ఇంకొక జన్మ ఎత్తవలసి వచ్చింది అన్నమాట. అది సామాన్య తేజస్సు వల్ల
జరుగ కూడదు. బ్రహ్మ సంకల్పం అల్లాంటిది. కనుక ఆదిత్యులైన మిత్రావరుణులు అమోఘ వీర్య సంభూతుడైన మైత్రావరుణి అయ్యాడు.

       నేలపై పడిన వీర్యాన్ని ఊర్వశి ఒక చక్కని కుంభం (కుండ) లో ఉంచి పోయింది. దాని నుంచి పుట్టిన వాడు పొట్టివాడైన ఆకారానికి , గట్టివాడు. ఆత్మ శక్తికి ఎవరాయన.. ఆ... అతడే అగస్త్య మహా ముని  .  మహాత్ముల జనన కధలు ఇలాగె వింతగా విడ్డురంగా ఉంటాయి. ఏరుల పుట్టుక, మహాత్ముల పుట్టుక యెరుగ శక్యము  కాదు.

     జలమందు వీర్యం మత్య సంతతికి బీజమయింది . ఇందే  వసిష్ఠుడు మైత్రావరుణిడి అయిన కథ . దీనిని వ్రాసినా , చదివినా, వినినా పాప విముక్తి భుక్తి  ముక్తులు కలుగుతాయి.  సంతతి లేనివారు నిత్యమూ మైత్రావరుణుని కధ  చదివితే ఆపత్య  ప్రాప్తి కలవారు అవుతారు . ఇది ముమ్మూర్తులకు ఇష్టమైన కధ .

    అని చెప్పి ఇంకా సుతుడు ఇలా చెప్తున్నాడు.

                                        

       5   మార్కండేయుడు 
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
    
ఒకప్పుడు కురుక్షేత్రములో అప్పుడే ధ్యాన ముద్రనుంచి కనులు తెరచి చిరునవ్వుతో మమ్మల్ని చూస్తున్న మా గురుదేవుని వద్ద గురు పుత్రుడు శుకుడు చక్కని ప్రశ్న వేసాడు. ఏమిటో తెలుసా?

    నాయనా మార్కండేయుడు  మృత్యుంజయుడు ఎలా అయినాడు? ఆ వృత్తాంతం చెప్పవలనది అని ఆ ప్రశ్నకి మా గురుదేవులు నాయన శుకా  మంచి ప్రశ్న వేశావు చెప్తాను విను  అని మమ్మలిని కూడా వినడయ్యా  అని బోధించి చెప్పిన మార్కండేయోపాఖ్యానం చెప్తాను విను భారద్వాజ ! మునులారా! వినండి . అపమృత్యుహరమైన కధ.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది