రమణ బోధ

రమణ బోధ
----------------------------------------------------------------
ప్రశ్న . శరీర త్యాగానికి ముందే ముక్తిని సాదించవలెనా ?,తరువత కుడా సాధించడానికి అవకాశముంటుందా ?
జ . నీకు చావు ఉందా ?ఆ చనిపోయేదెవరు ? చనిపోయే దేహన్ని గురించిన ఎరుక నీకు ఉందా ? ఉంటే అది నిద్రలోకూడా ఉందా ? నీ నిద్రలో దేహం లేదు . అపుడు కుడా నివు వున్నావు ! మెలుకున్నపుడు నీకు దేహం వచ్చింది . అప్పుడు కూడా నీవు ఉన్నావు .నీవు నిద్రలొ ,మెలకువలో కూడా ఉన్నావు . కానీ నిద్రలో నీ దేహం లేదు .ఎందుకంటే అది మెలుకువలోనే ఉంటుంది .

ముక్తి అన్నది నీకు మరో పేరు .అది ఇప్పుడు ,ఎప్పుడు నీతొనే ఉంటుంది .అది ఎప్పుడో ఎక్కడో పొందవలసినది కాదు .అందుకోవలసినది కాదు .యేసుక్రీస్తు " భగవంతుని రాజ్యం నీలోనే ఉంది .ఇప్పుడే ,ఇక్కడ " అని అన్నాడు .

  గీతలో రెండవ అధ్యాయంలో 72 వ శ్లోకంలో మొత్తమ్ గీతను దృష్టిలొ ఉంచుకుని ఇలా అర్థం చేసుకొవాలి : నీవు ఈ జీవితంలోనే ముక్తిసాదించాలి .అది నీవు చేయలేకపోతే ,చనిపోయేటపుడైన భగవంతుని తలుచుకోవాలి .ఎందుకంటే అప్పుడు తానేది తల్చుకుంటాడో అదే తను అవుతాడు .కాబట్టి ఈ జీవితంలో దైవాన్ని తలపోస్తూ ఉండకపోతే ,దైవ ధ్యానాన్ని నీవు అభ్యసించి అలవాటు చేసుకోకపోతే చనిపోయేటప్పుడు దైవన్ని తలుచుకోవడం నీకు సాధ్యమే కాదు ."

కాబట్టి జీవించి ఉండగానే ముక్తిలో ఉండడం అభ్యసించాలి . అదే జీవన్ముక్తి .అదే సత్యం .

  🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది