హోమం చేసేటపుడు...

హోమం: హోమం చేసేటపుడు మంత్రయుక్తంగా ఆహుతులు అగ్నికి ఆవు నెయ్యితో వివిధ రకాల వనమూలికలతో అర్చించినపుడు వివిధ రకాల వనమూలికలలో ఉన్నటువంటి విశిష్టమైన సాత్వికమైన ఆ పదార్థాల యొక్క గుణములు మంచి శక్తి  రూపంలో ఆకాశంలోకి మేఘమండలాన్ని కూడా తాకి సూర్య మండలాన్ని చేరతాయి. సూర్య మండలంలోని వాయువు జలాన్ని శుద్ధిని కలిగిస్తాయి. మరి మన భూమి సౌరమండలం మీదే కదా ఆధారపడింది. అప్పుడు సకాల వర్షాలు కురుస్తాయి. ఈ మంత్రముల యొక్క జీవ విద్యుత్, అయస్కాంత తరంగాలు కురిసే నీటి బిందువులను, వీచే వాయువులను ప్రభావితం చేస్తాయి. అటువంటి సకాల వర్షము భూమి మీద పడినపుడు ఆ భూమి అంతా కూడా ఒక మంచి అయస్కాంత శక్తితో నిండిపోతుంది. అటువంటి భూమిలో నాటిన విత్తనాలు ఆ భూమిలోని ఇసుక రేణువుల నుండి శుద్ధమయిన, ఆరోగ్యవంతమయిన మంచి చైతన్యం కలిగిన శక్తిని గ్రహిస్తాయి. అటువంటి ఆహారాన్ని మనుష్యులు భుజించినపుడు వారిలోని ప్రతి కణములో కూడా పరిశుద్ధమయిన, సమతుల్యమయిన విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.ఆహారము మనస్సు అవుతుంది. ఇటువంటి ఆహరం భుజించిన వారికి మనస్సు సాత్వికంగా ఉంటుంది. వారి యొక్క జటరాగ్ని కూడా పరిశుద్ధమవుతుంది. వారిలో ఇతరుల పట్ల ప్రేమ భావము కలుగుతుంది. అంతర్లీనంగా వారి తేజస్సు వారి చుట్టూ ఉన్నవారిని మంచిగా ప్రభావితులను చేస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది