పెద్దాపురం పెద్దమ్మ మరిడమ్మ

పెద్దాపురం పెద్దమ్మ మరిడమ్మ
=====================
దేశంలో గ్రామదేవతలుగా వెలసిన 108 మంది సోదరీమణులలో చారిత్రక పట్టణం పెద్దాపురంలో వెలసి సుప్రసిద్ధమైనదిగా పేరొందిన "శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవాలయం" జాతర మహోత్సవాలు ఈ నెల 23 నుంచి జూలై 30 వరకు జరుగును

17 వ శతాబ్దములో పెద్దాపురంలో మానోజి “ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవత గా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు

17 వ శతాబ్దములో ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడివి గా వుండేధి. ఒక సారి ఆ అడవులో పశువుల కాపరులకి “ 16 ఏళ్ల యువతి కనిపించి “ నేను చింతపల్లి వారి ఆడపడుచుని . నేను ఈ ప్రదేశములో వున్నాను అని మా వాళ్ళకి చెప్పండి . “ అని చెప్పి అంతర్థానము అయ్యింది .ఈ వింతను చూసిన పశువుల కాపరులు వేను వెంటనే చింతపల్లి వారికి చెప్పారు జరిగింది అంతా ... ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ “ మానోజి “ చెరువు దగ్గరకి వొచ్చి చుట్టూ ప్రక్కల ప్రాంతములు వెతకగా ... వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతి రూపము దర్శనమిచింది . .. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్టించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప ధీపములు , నైవేధ్యములు చెల్లించి ఆరాధించటము ప్రారంభించారు .

ప్రతీ సంవత్సరము ఆషాఢ మాసము లో నెల రోజుల పాటు ఈ మరిడమ్మ అమ్మ వారి జాతర ఎంతో వైభవము గా జరుగుతాది . రాష్ట్ర నలుమూలల నుండి ఈ అమ్మ వారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూంటారు

పూర్వం కలరా లాంటి భయంకర వ్యాధుల నుండి .. ఆ గ్రామ ప్రజలను రక్షించే అమ్మవారుగా ఎన్నో మహిమలు చూపించింది . పిలిస్తే పలికే తల్లిలాంటి ఈ అమ్మవారిని చుట్టుప్రక్కల గ్రామాల వారు #కులదైవము గా ఆరాధిస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది