మృగతృష్ణన్యాయం

*మృగతృష్ణన్యాయం

పంచతంత్రంలోనిఓ కథ:

ఎండాకాలంలో కొన్ని వానరాలు దప్పికతో అలమటిస్తూ ఎడారిలో “ఎండమావులని” నీళ్ళుఅని భ్రమపడి చాలా దూరం పయనించి అలసిపోతాయి. దగ్గరలో ఉన్న ఓచెట్టు నీడలో విశ్రాంతి పొందుతూ నీళ్ళు దొరకలేదని బాధ పడుతుంటాయి. ఆ చెట్టు తొర్రలో ఓ కుందేలు ఉంటుంది. అది వీటిబాధ చూడలేక ఇలా అంటుంది.

“ఓ వానరులారా! మీరు ఎండమావులని చూసి నీళ్ళు అనుకొని భ్రమపడుతున్నారు. మూర్ఖత్వంతో మీరు ఎంతదూరం పయనించినా నీళ్ళు దొరకవు. ఇలా కుడిప్రక్కకు వెళితే జలాశయంఉంది, అక్కడికి వెళ్లి దాహం తీర్చుకోండి” అని మంచిమాట చెపుతుంది. ఆమాట విన్న వానరాలు “అల్ప ప్రాణివైన నువ్వామాకు నీతులు చెప్పేది”అని కోపించి, కుందేలుని పట్టుకొని నేలపై కొట్టి చంపి, ఆ కుందేలు చూపిన దిక్కుకే వెళ్లి దాహం తీర్చుకొని వెళ్ళిపోతాయి.

----------
నీతి: ఇది మూర్ఖులకు మంచి చెప్పరాదు.  మూర్ఖ వానరాల్లా మనంకూడా లేని మృగతృష్ణ వెంట పడకుండా, ఋజుమార్గంలో పయనించి, సత్యాన్నికనుగొనాలని ఈ న్యాయం తెల్పుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది