దశవతారాలకి ఆయా తిధులు మాత్రమే ఎందుకు

దశవతారాలకి ఆయా తిధులు మాత్రమే
ఎందుకు ఎంచుకోబడ్డాయి
కొంచెం వివరించగలరా..
ఎప్పటినుండో నా మదిలో మెదులుతున్న ప్రశ్న

మత్స్య ,కూర్మ,వరాహ,నరసింహ,వెంకటేశ్వర అవతారాలు ఆపద కలిగింది కాబట్టి వచ్చారు తిధి చూసుకొని రారు.
తిధి చూసుకొని వచ్చింది వామన(పాల్గుణ శుక్ల పాడ్యమి),పరశు రామ(వైశాఖ శుక్ల తదియ),శ్రీ రామ(చైత్ర శుద్ధ నవమి),శ్రీ కృష్ణ(శ్రావణ శుద్ధ అష్టమి) ఎందుకు ఆ తిధులలో వచ్చారు అన్నది మీ సందేహం అవునా?

జవాబు: అవును

ఈ విషయం అర్థం అవ్వాలంటే కొద్దిగా జ్యోతిష్య శాస్త్ర ప్రవేశం ఉండాలి.6 వేదాంగలలో జ్యోతిష్యం ఈశ్వరుని కన్నులు అని వ్యవహరిస్తారు.ఇక్కడ అందరికి వచ్చే అనుమానం మన పుట్టుకకు,పాప పుణ్య అనుభవమునకు కారణం మనం చేసుకున్న కర్మలా? లేక గ్రహ ప్రభావమా?
అంటే మనం చేసిన కర్మలను అనుసరించి మన ఉపాధి వచ్చే జన్మలో నిర్ణయింప బడుతుంది. పాప ఫలితంగా కష్టం, పుణ్య ఫలితంగా సుఖం ఇవ్వబడుతుంది.మరి గ్రహాల ప్రాధాన్యత ఏమిటి? అంటే ఇక్కడ గ్రహాఁ అంటే ఏమిటో తెలియాలి.గ్రహం అంటే ఇంగ్లీష్ translation లా planet కాదు మనం చేసే కర్మలను గ్రహించి,తదనుగునంగా మనపై ప్రభావం చూపెవి గ్రహములు అని పేరు పెట్టారు. అందుకే జ్యోతిష్యం లో సూర్యుడు ,చంద్రుడు కూడా గ్రహాలే.

జ్యోతిష్య శాస్త్రం మనపై ఎలా ప్రభావం చూపుతుంది?
మనకు పంచ భూతాలలో(పృథ్వి ఆపస్ తేజో వాయు ఆకాశం(ఖాళీ స్థలనకు ఆకాశం అని పేరు)) మార్పులకు కారణం గ్రహాలు.ఉదాహరణకు సముద్రం పొంగడానికి కారణం చంద్రుడు అని అందరు  అంగీకరిస్తారు(అందుకే పౌర్ణమి కి ఆటు పోటులు ఎక్కవ).వాతావరణం లో ఋతువులు ఏర్పడడానికి కారణం సూర్య చంద్ర గమనములే ఇలా భూమి మీద ఉండే భూతములపై గ్రహ ప్రభావం ఉందని అర్థం అవుతుంది.
అలాగే మన శరీరం లో కూడా పంచ భూతాలు(శరీరం, రక్తం ,వైస్వనరాగ్ని(శరీర ఉష్ణోగ్రత ),వాయువు,నవ రంద్రాలు వరుసగా) ఉంటాయి.పఞ్చ భూతముల పైన గ్రహ ప్రభావం మీరు అంగీకరించిన అంగీకరించక పోయిన ఉంటుంది.అలాగే పంచ భూతమయమైన ఈ శరీరం పై గ్రహ ప్రభావం ఉంటుంది.అందుకే గమనించండి సూర్య కిరణములు ఎక్కువగా ఉన్నపుడు తాపం,చిరాకు ,విసుగు కలుగుతాయి.
అలాగే చంద్ర కిరణములు ఆహ్లాదం ను ఇస్తున్నాయి.అనగా మనలో గుణములు కలగడానికి గ్రహములు కారణం అయ్యాయా?లేదా?.
సరే ఇదంతా ఎందుకు చెప్పానంటే జ్యోతిషం ఒక శాస్త్రము(ఇందులో ఖగోళ,నక్షత్ర శాస్త్రం (ఖగోళ నక్షత్ర శాస్త్రం+గణిత శాస్త్రం+ అంచనా వేయడం కలిపి జ్యోతిష్య శాస్త్రం అంటారు దీని గూర్చి పూర్తి వివరణ వేదవ్యాస్(ఐ ఏ ఎస్) గారు రాసిన మహనీయుల జాతకాలలో చూడవచ్చు)అని ఒట్టి మూఢ నమ్మకం కాదని చెప్పడం కోసం.
మన మహర్షులు మన కోసం వారి తపస్సును వేచ్చించి ఈశ్వర శాసనాన్ని,ఈశ్వర ప్రకృతి శాసనాలను,ఈశ్వరుని calculation ని తెలుసుకొని మనకు అందించిన గొప్ప శాస్త్రం ఈ జ్యోతిష్యం.

ఇప్పటికి జ్యోతిషం పై విశ్వాసం రాకపోతే దయచేసి  మిగతా పోస్ట్ చడవకండి....

పరమేశ్వరుడు ఏ పని చేసినా నిర్దిష్టమైన ప్రణాళికతో కాల స్వభావ నియమాలలో మార్పు లేకుండా నిర్వహిస్తాడు. అనగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలే పట్టాలి,సూర్యుని చుట్టూ తిరగడానికి 365 days  పట్టాలి అని.అట్లాగే జీవుడు కూడా వాడి కర్మ ఫలితాలు అనుభవించటానికి తగినట్లుగా గ్రహాలు వచ్చే సమయం వరకు చూచి దానికి తగ్గ ఉపాది పొంది కష్ట సుఖములు అనుభవిస్తారు.ఇది జీవునికి సంబంధించినంత వరకు
కానీ ఇప్పుడు ప్రశ్న పరమేశ్వరుని గురించి
పరమేశ్వరుడు ఎప్పుడు ఏ అవతారాలు స్వీకరించిన ప్రకృతి ని అతిక్రమించి ప్రవర్తించడానికి దాదాపు గా ఇష్టపడడు.
కాబట్టి పరమేశ్వరుడు కూడా తాను ఒక ఉపాధి ని స్వీకరించి ఏ కార్యములు చేయలనుకుంటున్నాడో ఆ కార్యక్రమములు నెరవేరడానికి తగిన కాలాన్ని,గ్రహములు ఏ స్తానములలో ఉంటే అవి సవ్యంగా జరుగుతాయో చూసి జన్మిస్తాడు.
అలాగని భగంతుడిని గ్రహాలకు ఆధీనుడు అని అనకూడదు.గ్రహాల శాసక కర్త ఆయి ఉండి కూడా మనపై అనుగ్రహముతో అవతారం స్వకరిస్తాడు అని గుర్తుంచుకోవాలి.వేదం ఈ విధంగా చెబుతుంది"పితా పితృమాన్ యోని యోనౌ నావేదవిన్ మనుతేతం బృహన్తం"(ఉదాహరణలు చెప్పవచ్చు కానీ పోస్ట్ పెద్దగా అవుతున్నదని చెప్పటం లేదు)

ఇప్పుడు దశవాతారముల గురించి చూద్దాం
యుగములను అనుసరించి పరమేశ్వరుడు అవతారాలు స్వీకరించాడు.
కృత: మత్స్య,కూర్మ,వారాహ,నరసింహ(4)
త్రేతా:వామన,పరశు రామ,శ్రీ రామ(3)
ద్వాపర: శ్రీ కృష్ణ,వేంకటేశ్వర(బల రామ అని కూడా అంటారు)(2)
కలియుగ: కల్కి(1)
వీటి విశ్లేషణ చాలా ఉంది కాని ఇప్పుడు అడిగిన ప్రశ్నకు అంత సంబంధం లేదు.

1. వామన అవతారం:
              పాల్గుణ శుక్ల పాడ్యమి నాడు దేవతల భాద చూడలేక అదితి పయో వ్రతం చేయగా శ్రావణ  ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్‌ ముహూర్తం లో సూర్యుడు చరించునప్పుడు వామనుడు జన్మించాడు. వామనుడిగానే పుట్టాడు(పుట్టడమే వటువు వయస్కునిగా పరమాత్మ ఆవిర్భవించాడు).
ఆయన జన్మ కుండలి పరిశీలన చేద్దామంటే గ్రహ స్థితి గతులు విష్ణు పురాణంలో కానీ,భాగవతము లో కానీ స్పష్టంగా తెలియడం లేదు.శ్రావణ నక్షత్ర అది దేవత శ్రీ మహా విష్ణువు, అలాగే ద్వాదశి కి కూడా విష్ణువు అది దేవత కాబట్టి పూర్ణ విష్ణు తత్వాన్ని (విష్ణువు అనగా సర్వ వ్యాపకుడు అని అర్థం ఉన్నది)చూపడానికి వచ్చిన అవతారం కాబట్టి శ్రావణ మాసం లో వచ్చాడు.ద్వాదశి అధిపతి విష్ణువు కాబట్టి తానే విష్ణువును అని చెప్పడానికి ద్వాదశ తిధి నాడు వచ్చాడు.

2.పరశురాముడు:
       పరశురాముడు స్కంద పురాణ రీత్యా వైశాఖ శుక్ల తదియ నాడు జన్మించాడు.వైశాఖ మాసమునకు వేదంలో మాధవ మాసం అని పేరు ("మదుశ్చ మాదవశ్చ వాసంతిక ఋతు "అంటుంది వేదం). మాధవ మాసం ఎందుకంటే మా అంటే లక్ష్మీ,భూమి అనే అర్థాలున్నాయి దవ అంటే భర్త అని అర్థమ్. 21 మార్లు సమస్త భూ మండల వలయాన్ని జయించి భూమిని భర్త గా వరించాలి కాబట్టి మాధవ మాసం.నరసింహ అవతారం కూడా ఈ మాసంలో వచ్చింది.
నిర్భయంగా ప్రపంచాన్ని తిరగాలి ,దుర్మార్గ రాజులను చంపి ప్రజలకు అభయం ఇవ్వాలి కాబట్టి గౌరి దేవి అది దేవతగా కల్గిన తదియ తిధిని ఎంచుకున్నాడు.

3. శ్రీరాముడు:
         వసంత ఋతు చైత్ర మాసం పునర్వసు నక్షత్రం నవమి తిధి నాడు జన్మించాడు.
వసంతం: "తస్య దేవా వసంత శిరః గ్రీష్మఓ దక్షిణ పక్ష:"అంటుంది వేదం
సర్వస్య గాత్రస్య శిరః ప్రదానం కాబట్టి అన్ని అవతారాలలో ఇది ముఖ్యమైన, పరిపూర్ణ అవతారం అని చూపించడానికి వసంత ఋతు.

చైత్ర మాసం: చైత్ర మాసానికి వేదంలో మధు మాసం అని పేరు.అతి మధురమైన రామ నామం,మధురమైన నడవడిక కల్గిన వాడు కాబట్టి చైత్ర(మధు)మాసం.

పునర్వసు : పున అంటే మరల వసు అంటే ఐశ్వర్యం. పేరుకు చక్రవర్తే కానీ ఎవరికి వారు స్వయం ప్రతిపత్తిగా రాజ్యాలను పరిపాలన చేసుకుంటున్న సమయంలో అరణ్యవాసం పెరు మీద అన్ని రాజ్యాలను ఒక్క తాటి పై నిలబెట్టి మళ్ళీ ఐశ్వర్యాన్ని సంపాదించాడు కాబట్టి పునర్వసు.

నవమి:
"ఇక దశ శత సహస్రి లక్షాధిక్య శ్చ గుణ్యమానాపి న జానాతి శుశ్రుమాపం నవమి సఙ్కఏ వసేత్"
ఎంత సంఖ్య పెట్టి హెచ్చవేసిన మళ్ళీ కలిపితే అదే సంఖ్య వస్తుంది అది నవమికి ఉన్న గొప్పదనం.అలాగే రాముడు ఎటువంటి కష్టాలు ఎదురైన మారకుండా ధర్మాన్ని పట్టుకోవాలి కాబట్టి నవమి.

శ్రీ కృష్ణుడు:
     శ్రావణ బహుళ అష్టమి( కొంతమంది పరిశీలించి  భాద్రపద బహుళ అష్టమి అని కూడా చెప్తున్నారు) మొత్తానికి అష్టమి మాత్రం ఖెచ్చితం దీనికి అధిపతి శివుడు అంటే శివుడు లయ కారకుడు. మహాభారత యుద్దానికి శివుడికి చాలా సంబంధం ఉంది.
శ్రీ కృష్ణుడు కూడా ఉద్దవుని దగ్గర శివుని గూర్చి తెలుసుకున్నట్టు ఉంది.మహాభారత యుద్దానికి కారణం(సంహార కారకం) కావాలి కాబట్టి అష్టమి తిధిని ఎంచుకున్నాడు.తృతీయాధిపతి చంద్రుడు కావడం వల్ల తన వాక్చాతుర్యంతో సమ్మోహింపచేయగలడు.
       
       

శివోహం శివోహం శివోహం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది