_అప్పో దీపో భవ_

🍁☘🍁☘🍁☘🍁☘🍁

   🔥✨ *_అప్పో దీపో భవ_* ✨🔥
    *_BE A LIGHT INTO YOURSELF_*

      🦋   *_సత్యం_* 🦋

అనగనగా ఒకానొక రాజ్యంలోని మహారాజుగారికి, ఒకనాడు ఉదయాన్నే ఒక ఆలోచన వచ్చింది.

వెంటనే తన మంత్రిని పిలిచి, తనకో మూడు ప్రశ్నలున్నాయని, వాటికి సమాధానం తెలుపమని కోరుతాడు. అపుడా మంత్రి వర్యులు మహారాజుతో… 'తమ ప్రశ్నలేమిటో, సెలవియ్యండి మహాప్రభో! అవశ్యం బదులివ్వగలము' అంటాడు.
అపుడు రాజు గారు మంత్రితో ఇలా తన ప్రశ్నలను చెబుతాడు.

*1. ఈ లోకంలో అత్యంత విలువైన, గొప్ప సమయమేది?*

*2. ఈ లోకంలో మహా గొప్పవారైన వ్యక్తి ఎవరు?*

*3. ఈ లోకం చేయదగ్గ పనుల్లో అత్యంత ఉన్నతమైన పని ఏమిటి?*

అని.
రాజుగారి ఈ ప్రశ్నలను విన్నవెంటనే.... మంత్రిగారు ఏమాత్రం తడుముకోకుండా , "ప్రభూ! మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడైన సమయమే గొప్ప సమయం, రాజ్యాన్ని చక్కగా సంరక్షిస్తున్న మీరే గొప్పవారు, మన రాజ్యాన్ని మరింతగా విస్తరించడమే సరైనపని అని అంటూ బదులిస్తాడు మంత్రి.

మంత్రి సమాధానాలతో సంతృప్తి చెందని రాజుగారు, అదే విషయం మంత్రితో చెప్పి, ఈ ప్రశ్నలు నా మదిలో మెదిలిన నాటి నుంచీ… నాకు వీటికి సమాధానం తెలుసుకోవాలనే కుతూహలము, ఆసక్తి మరింతగా అధికమయ్యింది. అంచేత ఈ ప్రశ్నలకు సరైన సమాధానమివ్వగలవారు ఎక్కడున్నసరే… వెంటనే వారిని తన వద్దకు తీసుకురమ్మని మంత్రికి చెబుతాడు.

అప్పుడు మంత్రిగారు బాగా ఆలోచించి, మహారాజుతో ఇలా చెబుతాడు. “ప్రభూ! మన రాజ్యానికి ఉత్తర దిక్కులో వున్న పర్వతంపై ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆ యోగీశ్వరుని దగ్గరకు మనమే వెళ్ళినట్లయితే వారి వద్ద మీకు సంతృప్తికర సమాధానం లభించవచ్చు” అంటాడు మంత్రి.

రాజు ఒక్కక్షణం ఆలోచించి... సరే ప్రయాణానికి వెంటనే… సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు.
మొత్తానికి కొంతమంది పరివారంతో కలిసి మహారాజు ఇంకా మంత్రి గణం... ఆ పర్వతశ్రేణి పాదల వద్దకు చేరుకుంటారు.

అయితే... రాజపరివారం, సైనికులు పర్వతం ఎక్కడం సబబు కాదని భావించిన మహారాజు వారందరినీ అక్కడే వుండమని చెప్పి, అతి కష్టం మీద తానే ఆ పర్వతం ఎక్కుతాడు.

అక్కడ శిఖర భాగానికి దగ్గరగా... చదునుగా వున్న ప్రదేశంలో నిర్మితమై వున్న ఒక చిన్న కుటీరంలో కూర్చుని, ధ్యాననిమగ్నుడైన ఆ మహనీయుని సాధనకు భంగం కలిగించకూడదని, ఆయన తన సాధన విరమించేవరకూ వేచి చూద్దామని, ఆ మౌని ముందే కూర్చొంటాడు రాజు. కానీ ఎంతసేపటికీ కూడా ఆ మహనీయుడు కళ్ళు తెరువకపోవడంతో... తన ఆయుధ సామాగ్రిని, ఖడ్గాన్ని ప్రక్కన వుంచి, నిదురలోకి జారుకుంటాడు మహారాజు.

రాత్రి గడిచి తెలతెలవారుతుండగా మెలుకువ వచ్చిన మహారాజు, కళ్ళుతెరిచి చూడగానే ఆ మునీశ్వరుడు కనిపించడు.

ఆయనకై వెతుకుతూ అలా ఆ పర్వత శిఖంపై... కుటీరంలోనుంచి బయటకు వచ్చి చూసిన అతనికి.... తొలి సంధ్య వెలుగులు చక్కని ఆనందాన్ని కలిగిస్తుండగా... కోయిల స్వరాలు, పక్షుల కిలకిలా రావాలు అతడిలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి.

అలా ఆ పర్వత శిఖర అంచుకు వచ్చి చూడగానే తనకు తన రాజ్యం మెత్తం కనిపించేప్పటికి, రాజు ఎంతో ఆనందంతో వుంటాడు.

వెంటనే... వెనుక నుంచి కత్తి దూసుకు వచ్చి అతని కంఠం మీద నిలుస్తుంది. ఇంతకూ ఆ రాజుపై కత్తి దూసిన వాడు వేరెవరో కాదు ఆ మునిపుంగవుడే. రాజుకు ఒక్కక్షణం ఏమీ అర్థం కాలేదు. ఏమీ చేయకుండా అలా మెడపై కత్తిని చూస్తూ మిన్నకుండి పోయాడు... ఏ విధమైన ప్రతిచర్యా చేయకుండా.

అప్పుడు ఆ యోగీశ్వరుడు మహారాజుని ఇలా ప్రశ్నిస్తాడు....  ఈ లోకంలో అత్యంత విలువైన సమయమేది? అత్యంత గొప్ప వ్యక్తి ఎవరు? అత్యంత గొప్పదైన కార్యమేమిటి? అని.... తన ప్రశ్నలే తనకే… ఎదురైనప్పటికీ.... తన మెడకు కత్తి కొన తాకుతుండగా... పర్వత శిఖరం అంచున నిలిచి వున్నఆ మహారాజు ఆ యోగితో.... *"అయ్యా! ఈ క్షణమే అత్యంత విలువైనది, భవిష్యత్తుకానీ, గతం కానీ లేని ఈ వర్తమానంలో కూడా.. ఈ క్షణమే అత్యంత విలువైన సమయము, అలానే నాకు నేనే అత్యంత విలువైన వ్యక్తి... నా మరణ సమయంలో నాకు తోడుగా వున్నది 'నేను' మాత్రమే... 'అహం స్ఫురణ'గా నాకు నేనుగా వున్న ఈ స్థితిలో అత్యంత విలువైన వ్యక్తి ఆ'నేనే'. అలానే... ఈ లోకంలో అత్యంత గొప్పదైన పని ఏదైన వున్నదంటే... అది 'నన్ను నేను తెలుసుకోవడమే', మీ కృపావిశేషము వలన, నా ప్రశ్నలకు సరైన సమాధానమే కాక, నాకు నేను తెలియబడ్డాను, నన్ననేను తెలుసుకున్నాను, నేనెవరినో నాకు తెలిసింది.*

మీకు కృతజ్ఞతలిన చెప్పగా... ఆ యోగి పుంగవుడు… రాజు ఖంఠంపై వుంచిన కత్తిని వెనక్కుతీసి, మరలా ఆ మహారాజుకే ఇచ్చివేస్తాడు. ఆ మహారాజు ఆ యోగికి వందనం చేసి తిరిగి రాజ్యానికి చేరుకుని, చక్కగా రాజ్యపాలన చేస్తూ... రాజర్షిగా వెలుగొందాడు.

   🔥✨ *_అప్పో దీపో భవ_* ✨🔥
   *_BE A LIGHT INTO YOURSELF_*

🍁☘🍁☘🍁☘🍁☘🍁

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది