మన ధర్మంలో విధినిషేధాలు ఎందుకు ?


మన ధర్మంలో విధినిషేధాలు ఎందుకు ?

ఈ  మధ్య  చాలా మంది  అడిగే  ప్రశ్న: మేమెందుకు గర్భగుడిలోకి వెళ్ళలేము? మేమెందుకు మూల విగ్రహాన్ని ముట్టుకోకూడదు? మేమెందుకు  వేదం  నేర్చుకోకూడదు? పుస్తకాలు కొనుక్కుని మంత్రాలు మేము మాత్రం చదవలేమా?

వీటికి  కొంచెం సహేతుకంగా సమాధానపరుద్దాం.ఒక  కధ చెప్పుకుందాం.
ఒక రీసెర్చ్ లాబరేటరీ వుంది. దానిలో కొన్ని అణుధార్మిక పదార్ధాలు ఉంచబడ్డాయి. ఆ ల్యాబ్ లోకి వెళ్ళడానికి  కొందరికే అనుమతి వుంది. దానిలోకి  వెళ్ళాలంటే ప్రత్యేక ట్రైనింగ్, తీసుకోవలసిన జాగ్రత్తల మీద కొంత orientation అన్నీ వున్నాయి. దానిలోకి  వెళ్ళడానికి కొంతమందినే ఎంచి  వారికి మాత్రమె లోనకు వెళ్ళే అనుమతిని ఇచ్చారు ఆ పరిశోధనా గృహం వారు. ఇంతలో కంచర గాడిదయ్య అనే ఒకడు, అసంతృప్తి దేశదిమ్మరమ్మ అనే  మరో మహిళా శిరోమణి ఆ  సంస్థ మీద కసితో దీన్ని కొన్ని వర్గాల వారి కుట్ర అని గొడవ చేసి, గగ్గోలు పెట్టి వారు పని చెయ్యని సోమరులు వారిని మాత్రమె ప్రత్యేకంగా అనుమతిస్తున్నారని నానా యాగీ చేసి ఆ సంస్థను అప్రతిష్టపాలు చేసేవారు. చివరికి ఒకరోజు ఆ సంస్థ వారికి మండి వెళ్ళండి, కానీ సరైన ట్రైనింగ్ తీసుకోండని చెప్పారు. అబ్బ చ్చా మాకన్నీ  తెలుసులే అని వెళ్లి ఆ గదిని పరిశీలించి అక్కడ  వాళ్ళకేమి అర్ధం కాక ఆ పదార్ధాలను అటు ఇటు చూసి పట్టుకుని, మొహం మీద పెట్టుకుని సేల్ఫీలు దిగి కొన్ని టీవీ చానెళ్ళలో తాము చేసిన గొప్ప పనిని అందరికీ తెలిసేలా చేసి ఇన్నాళ్ళు తమను ఎలా అణగదోక్కారో కధలు అల్లి మరీ వివరించారు.కొన్నేళ్ళు బాగానే గడిచాయి. ఆ అణుధార్మిక వస్తువులకు తమవాడు, పగవాడు అని ఏమి తేడా వుండదు. ఇద్దరికీ శుబ్బరంగా కొన్ని అంతు తెలియని వ్యాధులు సంక్రమించాయి. కాన్సర్ అని, మరొకటి అని, ఎన్నో ఆ వస్తువుల దీర్ఘ కాలిక రోగాలోచ్చి చివరికి దేహత్యాగం చేసారు.

మేరీ క్యూరీ అణుధార్మికత మీద పరిశోధనలు చేసినప్పుడు ఎన్నో విషయాలు కనుక్కుంది. దాని వల్ల శరీరం మీద ఎటువంటి ప్రభావం వుంటుందో వివరంగా చెప్పింది. ఎలా కాపాడుకోగలమో చెప్పింది. కానీ ఆవిడ మాత్రం వాటి మీద పూర్తి అవగాహన సాధించే క్రమంలో ఎంతో దగ్గరగా ఆ  రేడియం తో పని చేసింది. దానివల్ల శరీర రుగ్మత కలిగి, కాన్సర్ తో మరణించింది. కానీ ఆవిడ తెలిపిన విధానంతో ఎందరో శాస్త్రజ్ఞులు కాపాడబడ్డారు. ఆవిడ భర్త కూడా అటువంటి రోగానికే ప్రాణం వదిలారు. కానీ వీరి పరిశోధనల వలన ఎన్నో విషయాలు, జాగ్రత్తలు తెలుసుకున్నారు. అటువంటి అన్ని విషయాలు గ్రంధస్థం చేసారు. దాన్ని వారు భావితరాలకు అందించారు. ఆ చెప్పిన విషయాల వలన ఎంతో జాగ్రత్తగా మరింత పరిశోధనలు చేసి యురేనియం, ప్లుటోనియం ఇలా ఎన్నో పదార్ధాలను కనుక్కుని, వాటి ద్వారా అమోఘమైన శక్తిని ఉత్పత్తి చేసారు మన శాస్త్రజ్ఞులు. కానీ దీనికి ఆది మాత్రం క్యూరీ దంపతుల విశేష పరిశోధన, కృషి. వారు ఈ విషయంలో వారు నేటికాలం మహర్షులు.

మన సనాతన ధర్మం గురించి ఒకసారి ఆలోచిస్తే మనకు తెలిసిన విషయం కూడా ఇంచుమించు ఇటువంటిదే. తమ శరీర సౌఖ్యాలను వదులుకుని తాము ఎన్నో విషయాల మీద పరిశోధనలు చేసి, తపించి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎన్నో విషయాలు తాము శిష్యులకు తరతరాలుగా బోధించారు. గ్రంధస్థం చేసారు. అవే మనకు పురాణఇతిహాసాలు, ధర్మ శాస్త్రాలు, ఆగమాలు ఇలా ఎన్నో రకంగా ఎన్నో విషయాలను జాగ్రత్తగా అందించబడ్డాయి. వాటిలో ఏ క్రతువులు ఎలా చెయ్యాలో, ఏ విగ్రహ ప్రతిష్ట ఎలా జరగాలో, ఒకడు దేవాలయంలో ఎలా మసలుకుంటే వాడికి మంచిది, ఏది చెయ్యకూడదు లాంటి  ఎన్నో విషయాలను పంచుకున్నారు. వాటిని చదవాలన్నా ముందు వారికి కొంత వేదజ్ఞానం వుండాలని నియమం పెట్టారు. ఇదేదో అందరికీ అందించవలసిన విషయాలు కావు, కేవలం ఎవరికైతే అధికారం వుందో వారు మాత్రమె ఈ గర్భగృహ ప్రవేశం చెయ్యాలి అన్న నియమాలను చెప్పారు. అలాగే సామాన్య జనం ఎలా ఉండాలో,వారి పరిధి ఎంతవరకో నిర్ణయించారు. మంత్రశక్తితో అక్కడ దైవీ శక్తిని ఎలా అక్కడకు ఆహ్వానించవచ్చో శాస్త్రం తెలిసిన వారికి తెలుస్తుంది. ఒక గురువు దగ్గర ఎలా మసలుకోవాలో, ఒక దైవం దగ్గర ఎలా మసలుకోవాలో చెబుతుంది శాస్త్రం. తద్విరుద్ధంగా చేస్తే  వారు తత్వ్యతిరిక్తమైన ఫలితాలు చవి చూస్తారు. ఒక శాస్త్రజ్ఞుడు చేసే పరిశోధన తెలియని వాడికి ఎలా పిచ్చిగా  వుంటుందో, మన క్రతువుల గురించి తెలియని వారికి అలాగే అర్ధం కాదు. అవన్నీ జాత్యహంకారంతో ఇలా వాళ్లకు వాళ్ళే  రాసేసుకున్నారని నేడు కొందరు కుహనా మేధావులు దుష్ప్రచారం చేస్తున్నారు. నేడు ఆ గర్భగుడిలోకి వెళ్లామని గొప్పగా చెప్పుకుంటున్నారు. దీని పర్యవసానాలు నేడు తెలియవు. కొన్ని రోజులు ఓపిక పడితే వారి ప్రాభవం మనం చూడకపోము.

ఒక  దైవప్రాసాదంలో మడి వుంటుంది, ఆచారం వుంటుంది. అక్కడ ప్రతిష్టితమైన శక్తి కి అనుసరణీయమైన ఒక పద్ధతి వుంటుంది. అవన్నే పాటిస్తేనే అక్కడకు వెళ్ళిన ఫలితం దక్కుతుంది. ఒక యూనివర్సిటీ కి ఎందుకు ఒక  స్కూల్ కు  వెళ్ళాలంటే ఒక యూనిఫారం వేసుకుని వెళ్తాం. ఒక ముఖ్యమైన మీటింగ్ కు  వెళ్ళాలంటే ఎంతో జాగ్రత్తగా తయారవుతాము. అంత భక్తి నమ్మకం వున్నవాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఒక

రకం దుస్తులు ధరించాలంటే బాధ ఎందుకు? ఎలాగైతే ఒక యంత్రాన్ని నడపగల టెక్నీషియన్ కు  మాత్రమె ఆ యంత్ర గదిలోకి  అనుమతి వుంటుందో, ఒక ఆపరేషన్ థియేటర్ లో ఎలా వైద్యం, శాస్త్ర చికిత్స తెలిసిన వైద్యులకు మాత్రమె ప్రవేశం వుంటుందో, యంత్ర తంత్ర మంత్రం ప్రతిష్టితమైన ఒక దేవాలయ గర్భగుడికి కూడా కొందరికే అనుమతి వుంటుంది. అది ఏ వర్ణం వారైనా సరే. బ్రాహ్మణుడు కదా అని అందరు బ్రాహ్మణులకు గర్భ గుడిలో ప్రవేశం వుండదు. ఇది తెలియని కొందరు కేవలం ఇది బ్రాహ్మణ కుట్ర అని అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరచినది అన్నట్టు ఒక అర్ధం కాని మూర్ఖుడు మరింత మందిని మూర్ఖత్వంలోకి నేట్టేస్తున్నాడు. తద్వారా దేశ సమగ్రతను దెబ్బ తీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ళకు ఎప్పటికైనా బుద్ధి రావాలని ప్రార్ధిద్దాం.వారికి కొంతైనా జ్ఞానం ప్రసాదించమని కోరుకుందాం.

RVSSS Charan:
ఈ పూజ పదార్థాల పరమార్థం ఏమిటి?                                                   పూజ.                                                                        అర్చన                                                            జపం.                                                    స్తోత్రం.                                                                   ధ్యానం.                                                               దీక్ష.                                                                                 అభిషేకం.                                                 మంత్రం.                                                            ఆసనం.                                                                    తర్పణం.                                                                       గంధం.                                                              అక్షంతలు.                                                     పుష్పం.                                                   ధూపం.                                                              దీపం.                                                                                నైవేద్యం.                                                            ప్రసాదం                                                                            ఆచమనీయం.                                                   అవాహనం.                                                                    స్వాగతం.                                                                పాద్యం                                                           మధుపర్కం.                                                                                       స్నానం.                                                                         వందనం.                                                                            ఉద్వాసన....                                                                       *********************
పూజ-పరమార్థాలు:

పూజ --> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.

అర్చన--> అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.

జపం--> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.

స్తోత్రం--> నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

ధ్యానం--> ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.

దీక్ష--> దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.

అభిషేక:--> అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.

మంత్రం--> తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.

ఆసనం--> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.

తర్పణం--> పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

గంధం--> అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.

అక్షతలు--> కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.

పుష్పం--> పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.

ధూపం--> చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.

దీపం--> సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.

నైవేద్యం--> ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.

ప్రసాదం--> ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.

ఆచమనీయం--> లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .

ఆవాహనం--> పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.

స్వాగతం--> దేవతను కుశలప్రశ్నవేయుట.

పాద్యం--> చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.

మధుపర్కం--> తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.

స్నానం--> గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.

వందనం--> అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).

ఉద్వాసన--> దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.

అజ్ఞాన తిమిరాంధస్య
జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన
తస్మయి శ్రీ గురవే నమః ॥
అజ్ఞాన దశలో కన్నులు మూసుకొనిపొయిన ఆధ్యాత్మికంగా అంధుడైన శిష్యునికి జ్ఞానం అనే కంటి కలికము పెట్టి గుడ్డితనమును నిర్మూలించి జ్ఞాననేత్రమును తెరిపించినది ఎవరో అట్టి శ్రీ గురుమూర్తికి నమస్కారము.
*హాన్స్ జెన్నీ కనిపెట్టిన యంత్రము టోనోస్కోప్ చిత్రించిన ఓంకారము:*
*మనం పలికే ఏ శబ్దమైనా ఒక ఆకారాన్ని సంతరించుకుంటుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్ఫారు.("రామ" అనే నామాన్ని నిరంతరం జపిస్తే కళ్ళెదుట రాముని రూపం సాక్షాత్కరిస్తుందని ఎన్నో కధల్లో చదివాము కదా!*
*ఈ విషయాన్ని చాలాకాలం పాటు "సైన్సు" చదువుకున్న మేధావులు ఒప్పుకోలేదు.చివరకి శాస్రజ్ఞుల పరిశోధనలలో ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు.*
*Father of cymatics science "హాన్స్ జెన్నీ (Hans Jenny)" అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త "టోనొ స్కోప్" అనే ఓ అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు.*
*ఏదైనా శబ్ద తరంగానికి విజువల్ రిప్రెసెంటేషన్ ని గీయడమే ఆ పరికరం చేసే పని! వివిధ ధ్వనులని చేసి, "టోనొ స్కోప్" సహాయంతో వాటి రూపాలని స్టడీ చేయడం మొదలు పెట్టాడు.ఆ ప్రయోగాల్లో భాగంగా, 'ఓంకారాన్ని ' సుస్ఫష్టంగా చదివించి, ఆ శబ్ద తరంగాల ద్వారా వచ్చే బొమ్మని గీశాడట.*
*ఆశ్చర్యం! ఓంకారం చదివినప్పుడు వచ్చిన ఆకారం ఇదే!*
*ఇదేమిటో తెల్సుగా? శ్రీచక్రం.*
*శ్రీచక్రమంటే అమ్మవారి శరీరమని మన శాస్త్రాలు* *చెప్తాయి*
*అలాగే మన వేదాలూ, ఋషులూ అమ్మవారిని "ఓంకార పంజర శుకీ" అనీ, "ఓంకార రూపిణీ మాతా" అనీ కీర్తించడం మనం విన్నాముకదా!*
*ఇదే ఓంకారానికీ, శ్రీచక్ర సంచారిణియైన అమ్మవారికీ మధ్యనున్న సంబంధం!ఈ విషయం మన పురాణాలు ఎప్పుడో చెప్పినా, సైన్సుకి మాత్రం తెల్సుకోవడానికి ఇంతకాలం పట్టిందంతే!*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది