కంచి కామాక్షి దేవాలయం

కంచి కామాక్షి దేవాలయం

భారత దేశ అతి ముఖ్యమైన మూడు శక్తి పీఠాలలో శ్రీ కామాక్షి దేవాలయం ఒకటి .పద్నాలుగవ శతాబ్దిలో చోళ రాజులు నిర్మించిన ఆలయం .పద్మాసనం లో ఉండే కామాక్షి అమ్మవారు అతి సుందర విగ్రహం . చేతిలో చెరకు గడ ,పుష్ప శరం ఉండటం విశేషం .జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు కామాక్షి అమ్మ్మవారి గర్భాలయం ముందు లో శ్రీ చక్ర ప్రతిష్ట చేయటం తో దీని ప్రతిష్ట ఇనుమడించింది .దీనికే పూజాదికాలు నిర్వహిస్తారు .కంచిలో కామాక్షి అమ్మవారే ముఖ్య దేవత గా పరిగణిస్తారు .ఇక్కడి శివాలయాలలో వేరే శక్తి రూపాలు ఉండవు .ఈమె అనుగ్రహం తో నే మూక కవి మూక పంచశతి రాశారు .ఆయన మూగ వాడై నందున అమ్మ తన తాంబూల రసాన్ని అతని నాలుక పై రాయటం తో అతనికి అమోఘ కవితా శక్తి అబ్బి ఈ శతకాలు అయిదు రాశారు అందులో ‘’ఆర్యా శతకం ‘’చాలా ప్రాచుర్యం పొందింది .మూక శంకరులు ఆ తర్వాత కంచి పీఠాన్ని అది రోహించారు అదీ అమ్మవారి కరుణా కటాక్షం .
* శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం
ఈలయం చాలా సార్లు పల్లవ ,చోళ ,విజయనగర రాజుల వల్ల పునర్నిర్మించ బడింది .ఇక్కడి 57 అడుగుల ఎత్తున్న రాజ గోపురం దక్షిణ భారత దేశం లో ఉన్న ఎత్తైన గోపురాలలో ఒకటిగా పేరొందింది .ఇక్కడి ఎకామ్బరేశ్వర లింగం పృధ్వీ లింగం గా పూజ లందుకొంటున్నది .ఇక్కడి 2,500 సంవత్సరాల మామిడి వృక్షం అత్యంత ఆకర్షణీయం
* శ్రీ కైలాస నాద దేవాలయం
కంచి పట్టణానికి పడమటి చివర ఈ ఆలయం ఉంది .దీనిని పల్లవ రాజు రాజ సింహ అ,అతని కుమారుడు మహేంద్ర ఎనిమిదవ శతాబ్దిలో నిర్మించారు .ఈ ఆలయం శివునికి అర్పించారు .ఇదే కంచిలో అతి ప్రాచీన కట్టడం .దక్షిణ భారత దేశ పల్లవ శిల్ప కల కు పట్టుగొమ్మ గా ఉంది .శివుని 64కళ లను ఇక్కడ ప్రతి బిమ్బించేట్లు చేశారు ఇంకెక్కడా ఇలా కనీ పించాడు .మామూలు రోజుల్లో కంటే శివరాత్రి నాడు లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి తరిస్తారు .
* విష్ణు కంచి –శ్రీ వరద రాజ స్వామి దేవాలయం
పన్నెండవశతాబ్దికి చెందిన ఈ వరద రాజ స్వామి దేవాలయం నిత్యం వేలాది భక్తులకు ప్రత్యెక ఆకర్షణ .తూర్పున పడమర రెండు గోపురాలున్నాయి .శ్రీ వరద రాజ స్వామి హస్తిగిరి మీద కొలువై ఉంటారు .స్వామి పశ్చిమ ముఖం గా ఉండటం ఇక్కడి విశేషం .పశ్చిమ ముఖ ద్వారం ద్వారా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు .విజయనగర రాజుల కాలం లో కట్టిన వెయ్యిస్తంభాల హాలు చాలా విశాలం గా శిల్ప శోభితం గా కనీ పిస్తుంది .ఇక్కడి నీటి కొలను ను అనంత పుష్కరిణి అనిపిలుస్తారు .ఈ కోనేటి నీటిలో ‘’అతిగిరి వరద రాజ స్వామి ‘’నీటిఅడుగున ఉంటారని భావిస్తారు .నలభై ఏళ్ళకోసారి ఆ స్వామిని బయటికి తీసి ,నలభై రోజులు దర్శనానికి అనుమతిస్తారు .మళ్ళీ నీటి అడుగున ఉన్చేస్తారు .వరద రాజ ఆలయం లో వెండి బల్లి గోడకు ఉంటుంది దీన్ని తాకి భక్తులు బల్లి పాటు వాళ్ళ వచ్చే అరిస్తాలను తొలగించుకొంటారు .
* కామకోటి పీఠం
జగద్గురువులు శ్రీ ఆది శంకరారాచార్యుల వారు భారత దేశం అంతా పాద యాత్ర చేసి నాలుగు ఆమ్నాయ పీఠాలనేర్పరచి పీఠాదిపతులను ఏర్పరచి చివరి రోజుల్లో కాంచీ పురం లో విశ్రాంతి తీసుకొన్నారు అప్పుడే ఈ పట్టణాన్ని పునర్నిర్మించే ఏర్పాటు చేసి శ్రీ కామాక్షి ,శ్రీ ఏకాంబరేశ్వర ,శ్రీ వరద రాజ దేవాలయాలను నిర్మించే ఏర్పాటు చేశారు శ్రీ కామ కోటి పీఠం ను ఇక్కడ క్రీ.పూ. 482 లోఏర్పాటు చేశారు . ఈ పీఠానికి ఆది శంకరుల నుండి అవిచ్చిన్ననం గా పీఠాది పతులు వారసులుగా వచ్చి ధార్మిక ప్రబోధం చేస్తూ వైదిక ధర్మ వ్యాప్తి చేస్తున్నారు . కామ కోటి పీఠం.అనేక ఆధ్యాత్మిక ధార్మిక సాంఘిక కార్య క్రమాలను నిర్వ హిస్తోంది
కాంచీపురం లో మనం ముఖ్యంగా చుడవాల్సినా ఆలయాలు :
1. శ్రీ కామాక్షి అమ్మవారిగుడి
2 .శ్రీ వామనమూర్తి దేవాలయము : (ఉలగళందప్పెరుమాళ్)
3 .రామనాధ స్వామి ఆలయం :
4. ఏకామ్రేశ్వర దేవాలయం:
5. కంచి కామకోటి పీఠం
6. కంచి మఠం వారి అన్నదాన సత్రం
7. కుమరకోట్టము - శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయము
8. శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము
9. శ్రీ కైలాస నాధుని ఆలయము
10. శ్రీ వరదరాజస్వామి ఆలయము
11. శ్రీ వైకుంఠనాధుని ఆలయము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది