మనలోని భారతీయతను పరిశీలిద్దామా?

🔴మనలోని భారతీయతను పరిశీలిద్దామా?🔴
      (యాజ్ఞికపీఠమ్ సోషల్ మీడియా డెస్క్)

😢 గడపకు పసుపురాయడం మూఢనమ్మకం పసుపు ఆంటిసెప్టిక్ అని యూరోప్ వాడు అనేంతవరకు.

😢 ఇంటిముందు బియ్యప్పిండిముగ్గు ప్రకృతి ఆరాధన అని మనకనిపించడంలేదు పక్కదేశం వాళ్ళు చెప్పేవరకు.

😢 కుటుంబం త్యాగాలు చేయడం అన్కల్చర్డ్, వ్యక్తిగత అభివృద్ధే నేడు నాగరికత అనిపిస్తోంది వేరెవరో చెప్పేవరకు.

😢 ప్రకృతి తల్లి అంటే మూఢనమ్మకం పాశ్చాత్యులు (ప్రకృతిని పాడుచేసి) పర్యావరణ సిద్ధాంతం చెప్పేదాక.

😢 నదులు తల్లి అంటే మూఢనమ్మకం పెద్ద ప్రభుత్వాలు శుద్ధీకరణ చేపట్టేవరకు.

😢 పల్లెటూళ్లే  స్మాల్ స్కేల్ పరిశ్రమలు అంటే ఛీఛీ అన్నాం. పెద్ద పెద్ద పరిశ్రమల కర్బన ఉద్గారాలు సివిలయిజ్డ్. ఇలా మన వ్యవస్థను భ్రస్టు పట్టిస్తున్నాము.

😢 ప్రకృతిని కొల్లగొట్టడం గొప్ప విషయం పెద్దదేశాలు అడవుల సంరక్షణ చేపట్టే వరకు.

😢 దేవుడు చేప అవతారం ఎత్తాడంటే జోకులేసుకున్నాము. పరిణామ సిద్ధాంతంలో మనకు కొంత తెలిసేవరకు.

😢 వాస్తు ట్రాష్, జ్యోతిషం అబద్ధం, ఆయుర్వేదం  ప్రయోగాత్మకం కాదు. మనదనేది ఆశాస్త్రీయం.

😢 సంస్కృతం డెడ్ భాష బ్రిటీష్ లు బెస్ట్ సుటింగ్ కంప్యూటర్ కి అనేంత వరకు.

😢 పసుపు చందనం గొప్పతనం, వేప, ఉప్పు గొప్పతనం వందల సంవత్సరాలుగా ఏమయ్యాయి? మనకు యూరోప్ వాడు చెబితేనే శాస్త్రీయమా.?

😢 జాతీయం అని మనం మాట్లాడితే సంకుచితత్వం. అంతర్జాతీయ సిద్ధాంతలే కావాలంటాం. వాళ్ళవి నాలుగే పాఠశాలలు ఉంటాయి.  అయినా పేరుమాత్రం ఇంటర్నేషనల్ ఫౌండేషన్.

😢 ఎక్కాలు బట్టీ పట్టిస్తే ఆశాస్త్రీయం ఫిజిక్స్, కెమిస్ట్రీలు బట్టీలు పట్టించేంతవరకు

😢 బంధేర దొడ్లలాంటి హొస్టళ్లు శాస్త్రీయం, ప్రేమతో కూడకున్న కుటుంబాలు ప్రతిబంధకం

😢 60 ఏళ్ళు దాటిన ఒకజంట  అమెరికాకు వెళ్తుంటే వాళ్ళ ఆత్మీయతకు సంతోషపడి ఎయిర్ హోస్టెస్ దగ్గరకువచ్చి అడిగిందట. When did you last married ? (ఈ చివరి పెళ్లి అయి ఎంతకాలమయింది? అని) 40 ఏళ్ళ క్రితం అని సమాధానం ఇచ్చారట. అంటే అన్ని రోజులనుండి ఒకేభార్య ఒకేభర్తా? అని ఆశ్చర్యపోయిందట.  మీ పిల్లల కుటుంబాలకు మీరు వెళ్తుంటారా? అనే ప్రశ్నకు.  మేమందరం కలిసేఉంటాము అన్నారట. కథ ఇంకాఉంది. అప్పుడు ఆమె ఏడ్చేసిందట. తాము ఎంత యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నామో అని.
👉ఇవన్నీ మనకు మూఢ నమ్మకాలు.

😢 మనం మారలేదు. మన పిల్లాడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్నాడంటే అబ్బో అంటాం. వూర్లో వ్యవసాయం చేస్తే, అయ్యో పాపం అంటాం. మనలోని ఈ మానసిక దరిద్రం త్వరలోనే పోవాలని మీరంతా గట్టిగా దీవించండి.

*మరో మంచి సందేశంతో మళ్లీ కలుద్దాం.*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది