ఎవరివో తద్దినాలు మనం సెలెబ్రేట్ చేసుకోవక్కర్లేదు. కాదంటావా?

చింటూ : ఏమిట్రోయ్ చాలా స్పెషల్ గా తయారయ్యావు? చేతిలో గిఫ్ట్ ఏమిట్రా?
పింటూ: ఇవాళ్ళ fathers day రా
చింటూ: మీ చర్చి ఫాదర్ పుట్టినరోజా?
పింటూ: కాదురా fathers day రా
చింటూ : మీ నాన్నగారి పుట్టినరోజా?
పింటూ : కాదేహే fathers day
చింటూ: అంటే?
పింటూ: ఈ రోజు fathers కి dedicate చేసిన రోజురా. వాళ్లకు గిఫ్ట్స్ ఇచ్చి విష్ చెయ్యాలి.
చింటూ: మీ నాన్నగారి పుట్టినరోజు కాదు, అలాగని మీ నువ్వేమి మీ నాన్నగారికి దూరంగా లేవు. ఇవాళ్ళ మాత్రం గిఫ్ట్ ఇస్తున్నావు.
పింటూ: ఒరేయ్ అందరూ న్యూ ఇయర్ చేసుకోవట్లేదా? టీచర్స్ day , కార్మికుల దినోత్సవం, ఇది అలాగే
చింటూ: భలే వుందిరా UNESCO వాళ్ళు సంవత్సరం పొడుగునా ప్రతి రోజు ఎవరికో ఒకరికి dedicate చేసారురా. అలాగని ప్రతి రోజు చేసుకుంటామా? సరే. ఒక మాట చెప్పు. టీచర్స్ day ఎప్పుడు? చిల్డ్రన్స్ day ఎందుకు చేస్తాం? అలాగే కార్మికుల దినోత్సవం ?
పింటూ: రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. చిల్డ్రన్స్ day నెహ్రు పుట్టిన రోజు. మే ౧న ఒక రోజున కార్మికులు ఏదో విజయం సాధించారు.
చింటూ: మరి fathers day ఏమిట్రా స్పెషల్?
పింటూ: ఎవరో ఫాదర్ ది పుట్టినరోజు అనుకుంటాను.
చింటూ: నీ తలకాయ్. ఆ రోజు clayton అన్న ఆవిడ తండ్రి పోయిన రోజు. ఆ రోజునే ఒక మొనొంగ అన్న గనిలో 250 మంది తండ్రులు సజీవ సమాధి అయ్యారు. ఆవిడ వాళ్ళ చర్చి ని అడిగి ఆ రోజు తండ్రుల రోజుగా అనౌన్స్ చేయించింది. అంటే ఎవరిదో తద్దినం మీ నాన్న గారికి సెలెబ్రేట్ చేస్తున్నావన్నమాట.
పింటూ: అవున్రా. అసలెందుకు చేసుకుంటున్నామో తెలీదు. అయినా ఒక రోజు మన వాళ్ళను విష్ చేస్తే తప్పా?
చింటూ: కావాలంటే ఒకసారి గూగుల్ లో వెతుక్కో? మన తల్లి తండ్రులు మనకు రొజూ పూజనీయులు. వారి సెలబ్రేషన్ అంటే వారి పుట్టినరోజో, లేక వాళ్ళకు important అయిన ఏదో రోజున చేసుకో. ఇది కేవలం మార్కెటింగ్ gimmick. ఆ రోజున గ్రీటింగ్స్, గిఫ్ట్స్ సేల్ పెంచడానికి ఇది మన అందరి నెత్తిన రుద్దుతున్నారు.
పింటూ: నిజమేరా
చింటూ: ఇది పాశ్చాత్య దేశాలలో వాళ్ళ తల్లిదండ్రులను ఒక్క రోజు స్మరించుకునే రోజు. వాళ్లకు వాళ్ళ తండ్రిని కనీసం ఒక్కరోజు స్మరించుకుంటారు. మనకది అవసరమా? ఈ మార్కెటింగ్ కి మనవాళ్ళు పడిపోయి చొక్కాలు చిమ్పేసుకుంటున్నారు.
పింటూ: మరేమీ చెయ్యమంటావు?
చింటూ: రొజూ వాళ్ళను మనం పట్టించుకుంటే చాలు రా. ఎవరివో తద్దినాలు మనం సెలెబ్రేట్ చేసుకోవక్కర్లేదు. కాదంటావా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది