🤴🏻💺➖➖➖➖➖➖➖➖
*భారతదేశ నాలుగవ రాష్ట్రపతి..వి.వి.గిరి గా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి గారి వర్దంతి నేడు..* June 23
➖➖➖➖➖➖➖🌸🌸🍃
"★ ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణములోని ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా మరియు పట్టణము ఇప్పుడు ఒడిషా రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్ళాడు.
*▪1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్‌ఫెన్ ఉద్యమములో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్‌నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది.*
*▪భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.*
*🌟వి.వి.గిరి జీవితఘట్టాలు..🍭*
🍬1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యాడు.
*🍬1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరి కాంగ్రేసు అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచాడు.*
🍬1937లో మద్రాసు ప్రోవిన్స్ లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రేసు ప్రభుత్వం లో కార్మిక మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు.
*🍬1942లో కాంగ్రేసు ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్ళాడు. ఈయన రాజమండ్రి జైలులో ఖైదీగా ఉంచారు.*
*🍬1952లో తొలి లోకసభ ఎన్నికలలో పాతపట్నం నుంచి ఎన్నికై 1954లో రాజీనామా చేసే వరకు కార్మిక మంత్రిగా వ్యవహరించారు.*
🍬1957లో ఇండియన్ సొసైటి ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ స్థాపించి కార్మికుల ఉన్నతికి పాటుపడ్డారు. 1956-60 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా, 1960-65 వరకు కేరళ గవర్నరు గా, 1965-67 వరకు కర్ణాటక గవర్నరుగా సేవలందించారు.
*🍬1967లో 3వ ఉప రాష్ట్రపతిగా, 1969లో భారతదేశ 4వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.*
*🍬1975లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఈయన "ఇండస్ట్రియల్ రిలేషన్స్" అనే గ్రంథాన్ని కూడా రచించారు.*
(ఆగష్టు 10, 1894 - జూన్ 23, 1980)