*యువకులం ..మనం యువకులం*
✨
కలలు కంటూ కూర్చున్ని మసిబారిపోదామా!
కలలకు కార్యరూపం ఇచ్చి చైతన్యవంతులమవుదామా!!
✨
అవమానపు అడ్డుగోడల కింద అనిగిపోదామా!
దైర్యంతో పోరాడి ఆ అవమానానికే ఆశ్యర్యం కలిగిదామా!!
✨
మట్టిపట్టిన మస్తిస్కాలను మంచి మాటలతో మార్చుదాం! సమాజంలో మార్పుకు మనమే మొదటి మనుషులమవుద్దాం!!
✨
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం!
యువకులం ..మనం అజేయులం అని ప్రకటిద్దాం!!
✨
చెడు వ్యసనాలకుదూరమవుద్దాం! చైతన్య సమాజానికి చెయ్యి ...చెయ్యి కలుపుద్దాం!!
✨
ఊరకే కూర్చోకుండా ఉడుకు రక్తంతో ఉరకలేద్దాం! యువకులం ..మనం యువకులం !!
✨
మంచి పనులు చేద్దాం...మంచి పేరు తెచ్చుకుందాం! తల్లి,తండ్రి ,గురువులు తల ఎత్తుకు తిరిగేలా చేద్దాం!!
*!!! యువకులం..మనం యువకులం !!!*