*మూత్రంలో మంట*
మూత్రాశయంలో మంట వుండును . ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూంటారు . మూత్ర విసర్జన సమయంలో మూత్రాశయంలో *నొప్పి* మరియు *మంట* వుండును. మూత్ర విసర్జన చేయడం చాలా కష్టంగా వుండును . మూత్ర పిండాలలో *రాళ్ళ* ఏర్పడే అవకాశం వుంది .
పొత్తి కడుపులో నొప్పి , చిరాకుగా ఉండటం , మూత్రంలో దుర్వాసన , తెలియ కుండానే మూత్రం బొట్లు , బొట్లుగా లీక్ అవ్వటం , మూత్రం సరిగా రాక పోవడం లాంటి సమస్యలు ఉండవచ్చు .
*గృహ చికిత్సలు* : --
# ప్రతి దినము1 గ్లాసు *క్యారట్ రసంని* త్రాగండి .
# 5 లేక 6 తాజా *ఉసరికాయల రసం* + *తేనె* కలిపి త్రాగండి .
# *త్రిఫల చూర్ణ కషాయం* + *బెల్లం పొడి* ని కలిపి త్రాగండి .
(1 గ్లాసు నీళ్ళలో 2 లేక 3 Table Spoon ల త్రిఫల చూర్ణంని కలిపి , మరిగించండి . కషాయం తయారవును .
# *సొరకాయ* + *బీరకాయ* లను కలిపి ఉడికించి , జొన్న రొట్టెలో తినవలెను .
# 1 Table Spoon *దానిమ్మ తొక్క పొడి* + 1 గ్లాసు *నీళ్ళలో* కలిపి త్రాగవలెను . ప్రతి రోజు 2 లేక 3 సార్లు త్రాగవలెను .
# *దోసకాయ* ( Cucumber ) ముక్కలు + *పటిక బెల్లం* పొడిని కలిపి సలాడ్ లాగా తినండి .
# 4 Table Spoon ల *ముల్లంగి రసం* + కొద్దిగా *సైంధవ లవణం* కలిపి త్రాగండి.
పై గృహ చికిత్స విధానాలలో ఏదో ఒకటి ఆచరించి , మీ అనారోగ్య సమస్యల నుండి ఉపసమనం పొందండి .
*పిల్లలకు* : ----
పిల్లలు పక్క తడుపుతుంటే ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి , పాలలో వేసి బాగా మరగ బెట్టి , చల్లార్చి , పిల్లలకు పాలను మాత్రమే త్రాగించండి .