ఒకసారి దేవేంద్రుడు తన ఏనుగుపై ఊరేగుతూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురుపడ్డాడు. ఇంద్రుడు మహర్షికి ప్రణామం చేస్తాడు. అప్పుడు దుర్వాసమహర్షి,(విష్ణువుకి అలంకరించిన) శేషపుష్పాన్ని ఇస్తాడు. ఇంద్రుడు ఆ పుష్పాన్ని ఏనుగు తలపై అలంకరిస్తాడు. ఏనుగు చిరాకుతో ఆ పుష్పాన్ని కిందపడేస్తుంది. అది చూసి దుర్వాసముని ఇంద్రున్ని "ఓరీ మదాంధుడా! విష్ణువు ప్రసాదాన్ని కళ్ళకి అద్దుకుని తీసుకొకుండా ఏనుగుకి అలంకరిస్తావ, అది దానిని కిందపడేస్తుందా. ఏ పదవిని, దైవత్వాన్ని చూసుకుని గర్వపడుతున్నవో అవి నశించి పోవుగాక" అని శపిస్తాడు. దాంతో ఇంద్రుడు బయపడి మహవిష్ణువుని శరణు వేడుకుంటాడు. అప్పుడు మహవిష్ణువు క్షీరసగరాన్ని మథించండి, అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని సేవిస్తే మీకెలాంటి కష్టాలు ఉండవు అని చెప్తాడు.
క్షీరసాగరాన్ని మథించడాని కవ్వంగా మంథర పర్వతాని, కవ్వపు తాడుగా వాసుకిని వాడాలని నిర్ణయానికి వస్తారు దేవతలు. కాని అంతపెద్ద కవ్వాన్ని తీప్పడానికి వారి శక్తి సరిపోక రాక్షసుల సహాయం కోరుతారు. అలా దేవ, దానవులు మథిస్తూ ఉండగా మథరపర్వతం సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు విష్ణువు మహ కూర్మావతారందాల్చి పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని యథస్తానానికి తెస్తాడు. మొదట హాలాహలం పుడుతుంది. దానిని శివుడు తాగుతాడు. అందువల్ల శివున్ని నీలకంఠుడు అంటారు.
ఆ తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభం, ఉచ్చైశ్రావామను గుఱ్ఱం, ఐరావతం, దన్వంతరి, వారుణి (మద్యం తయారు చేసే దేవత, రాక్షసులు తీసుకుంటారు),అప్సరసలు, కల్పవృక్షం, పారిజాత వృక్షం, కామధేనువు, చంద్రుడు(హాలహలం ప్రభావాన్ని తగ్గించడానికి శివుని ఇస్తారు) చివరిగా అమృతం లభిస్తుంది. అమృతాన్ని రాక్షసులు తీసుకుని వెల్లిపోతారు. విష్ణువు మోహినీ అవతారందాల్చి రాక్షసులను మాయచేసి అమృతాన్ని దేవతలకు ఇస్తాడు. దేవతలు అమృతాన్ని తగడానికి సిద్దమవుతుండగా, రాహువు అనే రాక్షసుడు వారిలో కలిపోతాడు. ఈ విషయాన్ని గమనించిన సూర్యచంద్రులు విష్ణువుకి చెప్తారు. విష్ణువు కోపంతో రాహువు శిరస్సును ఖండిస్తాడు. కాని అప్పటికే అమృతం రాహువు గొంతువరకు వెళ్ళడంతో శిరస్సు మాత్రం ప్రాణంతో ఉంటుంది శరీరం తెగిపోతుంది. అప్పటి నుండి సూర్యచంద్రులకు, రాహువుకు మద్య శతృత్వం మొదలైంది.
రాక్షసులు కోపంతో దేవతలపైకి యుద్దానికి వస్తారు కాని ఓడిపోయి తిరిగి పాతాళ లోకానికి వెళ్ళ్ళిపోతారు. బ్రహ్మ విష్ణులు అమృతాన్ని ఇంద్రునికిచ్చి జాగ్రత్తగ కాపాడమని చెప్పి వెళ్ళిపోతారు. క్షీరసాగర మథనంలో పుట్టిన ఉచ్చైశ్రావాన్ని చూసి కద్రువ, వినతలు పందెం వేసుకుంటారు