🙏ఇంద్రకీలాద్రి
అమ్మవారి జన్మదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై
సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ
సరస్వతి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న విద్యార్థులు
విద్యార్థులకు ఉచిత దర్శన భాగ్యం కల్పిస్తున్న అధికారులు
దర్శననంతరం విద్యార్థులకు పెన్ను, అమ్మవారి ఫోటో, రక్షాకంకణం, కుంకుమ ప్రసాదం అందచేసిన దేవస్థాన అధికారులు
💐💐వజయవాడ కనక దుర్గమ్మ తల్లి 💐💐
అమ్మలగన్నయమ్మ…. ముగ్గురమ్మల మూలపుట్టమ్మ..చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చిన యమ్మదన్నులో నమ్మినవేల్పు టమ్మల మనమ్ముల నుండెడియుమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్య కవిత్వపట్టుత్వ సంపదల్II శక్తి స్వరూపిణి…త్రైలోక్య సంచారిణి.. వేదమాత… అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకైన శ్రీజగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన ఆధీనం చేసుకొంటూ షోడశాక్షరీ మంత్రానికి అధిష్ఠానదేవతగా, శ్రీచక్ర నీరాజనాలందుకునే అపరాజితగా కొలువులందుకునే తల్లి, ఇంద్రాది దేవతలచే పూజలందు కొంటూ ఇంద్రకీలాద్రిపై స్వయంభువైన దేవి కనకదుర్గాదేవి. శ్రీఅమ్మ వారు స్వయంభూగా వెలిసి ఇంద్రకీలాద్రి రంగురంగుల విద్యుత్ కాంతులలో ధగధగ వెలిగిపోతుంది.
ఈ అమ్మవారి దేవళం స్వర్ణ కాంతులు విరాజిమ్ముతూ ‘కనకదుర్గమ్మ భక్తుల్ని ఆకట్టుకుంటోంది. చిరునవ్వులు చిందిస్తూ అభయహస్తం ఇస్తున్న అమ్మవారిని చూసిన భక్తులు ‘అమ్మచెంత ఉంటే అన్నీ ఉన్నట్లేనని భావిస్తున్నారు. దక్ష్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో రెండవ స్థానం కలిగి శ్రీశక్తి పీఠాలలో ఒకటిగా ప్రశస్తమైన కృతయుగం నాటి కోవెల అతి ప్రాచీనమైన శక్తిపీఠం విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం. దర్శన ఫలం : సృష్టి, స్థితి, లయకారిణియైన త్రిశక్తిస్వరూపిణి మన దుర్గమ్మ, దయామృతహర్షిణి జగన్మాతను మనసారా ఆరాధించి చరణాల్ని ఆశ్రయిస్తే మనకున్న దుర్గతుల్ని నశింపచేసి సద్గతుల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
శరన్నవరాత్రులు ఎంతో శక్తివంతమైన, శుభ్రప్రదమైనవి, మంగళకరమైనవి, వివిధాలంకార భూషితయైన అమ్మవారిని దర్శించి, కరుణా కటాక్ష వీక్షణాల్ని పొందవచ్చు. ఆలయ స్థలపురాణ విశేషగాధ: ఇంద్రకీలాద్రి పర్వత పాదభాగాన్ని తాకుతూ పరవళ్లు తొక్కే, కృష్ణవేణి చెంతగల ఈ పర్వతానికి ఈ పేరు రావడానికి ఒక ఇతిహాసం ఉంది. పూర్వం కీలుడు అనే యక్షుడు ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి గురించి ఘోర తపస్సు చేశారు. అతని తపస్సుకి మెచ్చిన అమ్మవారు కీలుడిని వరం కోరుకోమనగా పరమ సంతోషంతో జగన్మాతను అనేక విధాలా సుత్తించి ”అమ్మ! నీవు ఎల్లప్పుడూ నా హృదయమందు నివసించు అని కోరాడు. అందుకు దేవి ”ఓ యక్షా! నీవు పరమ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పర్వత రూపాన్ని ధరించు.
కృతయుగంలో అసుర సంహారానంతరం నేను నీ పర్వత మధ్యస్థం మందు కొలువై ఉంటాను అని వరం ప్రసాదించింది. కాలాంతరంలో కీలుడు పర్వత రూపాన్ని పొంది దేవి ఆవిర్భావం కోసం ఎదురు చూడసాగాడు. తదుపరి కృతయుగంలో దుష్ట దనుజుడైన మహిషాసురుణ్ణి సంహరించాక ఆ దుర్గాదేవి కీలుడికిచ్చిన మాట ప్రకారం మహిషాసురమర్థనీ స్వరూపంతో కీలాద్రి మీద స్వయం వ్యక్తమై ఆవిర్భవించింది. ఇంద్రాది దేవతలంతా వచ్చి నిత్యం దేవికి పూజలు చేయసాగారు. ఆనాటి నుంచి ఆ కీలపర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. దుర్గమ్మ కనకదుర్గమ్మగా ఇలా మారింది: దుర్గమ్మ కనకదుర్గమ్మగా మారడానికి ఒక కథనం ఉంది. ఇప్పుడు విజయవాడగా పేరున్న ఆనాటి బెజవాడలో సత్యసంధత ఎక్కువగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. క్రీ.శ. 1150-1240 పాలకేతు భూపాలుడు దుర్గమ్మ గురించి రెండు కథనాలు ఉన్నట్లు తెలిపాడు.
వాటిలో నగరాన్ని ఏలిన మాధవవర్మ సత్యసంధత గురించి ఆసక్తికరమైన ఒక కథనం ఉంది. మాధవవర్మ కుమారుడు నగర పర్యటన చేస్తుండగా, ఆ రథం కింద పేదరాలు కుమారుడు చనిపోతాడు. ఆమె వెంటనే మాధవవర్మ వద్దకు వెళ్ళి న్యాయం చేయాలని కోరుతుంది. దీనికి అతని వద్ద ఉండే సలహాదారులు ఆయన కుమారుడుకి శిక్ష వేయక్కర్లేదని, ఇది పొరపాటుగా జరిగిన సంఘటన అని న్యాయమీమాంసకు తావు ఇస్తారు. మాధవవర్మ తన కుమారుడికి శిక్షవేయడానికి వెనుకాడలేదు. తన కుమారుడికి మరణశిక్ష విధిస్తాడు. దీంతో కనకదుర్గమ్మ అతని సత్యసంధతకు మెచ్చి బంగారు వర్షం కురిపిస్తుందట. ఇదే కాక అటు మాధవవర్మ కుమారుడు, ఇటు పేదరాలు కుమారుడు. ఇద్దరు తిరిగి ప్రాణాలు పొంది లేస్తారు.
ఇంకో కథనంలో శ్రీపతి పండితయ్య కొండపై ఉన్న మల్లేశ్వరస్వామిని గాఢంగా ఆరాధించడం ఆయన నిప్పును మూటగట్టి శమీవృక్షంపై ఉంచడం వంటి ఆసక్తి కథనం ఉంది. మాధవవర్మ సత్యసంధతకు నిత్యబంగారు పూలవర్షాన్ని కురిపిం చడంతో దుర్గమ్మ కనకదుర్గమ్మగా పేరుపొందింది. అమ్మవారి శ్రీచక్రం: దుర్గాదేవి మహిషాసుర సంహారానంతరం, అదే స్వరూపంతో ఇక్కడ స్వయంభువుగా రౌద్రరూపంతో వెలిసింది. ఈ స్థితిని గమనించిన జగద్గురువు ఆది శంకరాచార్యులు అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మార్చి ఇక్కడ తమ మంత్రశక్తితో శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టించారు. నిత్యార్చనలు, కుంకుమార్చనలు అన్నీ దేవి మూలవిరాట్‌కి కాక అమ్మవారి ప్రతిరూపమైన శ్రీచక్రానికే జరుగుతూ ఉంటాయి.
తరతరాలుగా పూజలందుకునే శ్రీచక్రం ఎంతో మహిమాన్వితమైనది. దివ్యశక్తి స్వరూపిణి దుర్గమ్మ శరన్న వరాత్రి మహోత్సవాలలో వివిధరూపాల్ని ధరించి లోకాలన్నింటినీ అనుగ్రహిస్తుంది. నిత్యం, శరన్నవరాత్రి మహోత్సవాలలో వివిధా లంకారభూషిత అయిన శ్రీ అమ్మవారికి నవావరణార్చన అత్యంత ప్రశస్త్యమైనది.
ఆ తల్లికి ప్రీతిపాత్రమైన కుంకుమార్చనలో పాల్గొని ఆ దేవి దర్శనం చేసుకొని కరుణా కటాక్ష వీక్షణాల్ని పొందాలని కోరుకుంటారు. అమ్మశక్తికి భయపడి దాక్కున్న మల్లేశ్వరుడు: మల్లేశ్వరాలయానికి పెద్ద చరిత్రే ఉంది. అమ్మశక్తికి భయపడి శివుడు ఇంద్రకీలాద్రిపై దిబ్బలో దాగి ఉండగా ఆదిశంకరాచార్యులు చూసిపైకి రమ్మని పిలుస్తారు. ఆయన వచ్చాక మల్లెలతో పూజించినందున అప్పటి నుంచి మల్లేశ్వరుడయ్యాడని ప్రతీతి.
స్వయం భూ అయిన మల్లేశ్వరస్వామికి జయసేనుడనే పేరు కూడా ఉండేదని ఒక కథనం అగస్త్య మహాముని మల్లేశ్వరుని కొలిచినట్లు పురాణాలు చెబుతు న్నాయి. అయితే ఇంద్రకీలాద్రికి సంబంధించిన కథనాలలో ఇదో విశేషంగా పేర్కొన్నారు. అగస్త్య మహాముని శివుడుని జయ సేనుడుగానే కొలిచాడని అంటారు. పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసిన అర్జునుడు మల్లేశ్వరుడుని మల్లయుద్ధ వీరుడుగా పేర్కొ న్నారని, దానితో క్రమేణా మల్లేశ్వరస్వామిగా ప్రచారంలోకి వచ్చారని చెబుతారు.
అక్కడే నవగ్రహాలయం, వీరభద్రస్వామి ఆలయాలు న్నాయి. మల్లేశ్వరాలయానికి పక్కనే హాలులో నిత్యంచండీహోమం, గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుడి పేరిట శాంతి కళ్యాణం జరుగు తుంది. మల్లేశ్వరాలయానికి వెళ్లే దోవలో అద్దాల మండపం ఉంది. అక్కడ గంగా, పార్వతీ, మల్లేశ్వర ఉత్సవమూర్తులను ఊయలలో ఉంచుతారు. సర్పదోషనివారణ పూజలు చేయించుకోవడానికి వల్లిదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణేశ్వరాలయం, పక్కనే నాగేంద్ర పుట్ట ఉంది. దానికి వంద సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. వినాయకుడు, నటరాజు, శివకామసుందరీదేవి ఆలయాలు దుర్గగుడికి అను బంధంగా ఉన్నాయి.
ఉత్సవాలలో దుర్గమ్మకు ఏ అలంకారం చేస్తారో అదే అలంకారాన్ని శివకామసుందరీదేవికి కూడా చేస్తారు. విజయవాడ అనగానే ముందుగా గుర్తు వచ్చేది కృష్ణానది. కృష్ణానది చెంతనే ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ. శివకేశవులకు ప్రతీకగా కృష్ణవేణి మాతకు ప్రతి శనివారం పంచహారతులు ఇస్తారు. కృష్ణానదిలో ఒక్కసారి స్నానం చేస్తే సకల పాపాలు హరిస్తాయని వేదాలు చెబుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దశమి రోజు దుర్గమ్మను హంసవాహనంపై కృష్ణానదిలో జలవిహారం చేయించడం విశేషం.
Key Words : Telugu WhatsApp