పాంచజన్యము🐚*

పాంచజన్యము🐚*

శ్రీ కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం . బలరామ కృష్ణులు సాందీపుడు అనే ముని వద్ద విద్యాబ్యాసము చేసారు . ఆ సాందీప ముని కుమారుడు ఒక సారి సముద్రము నందు స్నానము చేయుచుండగా కెరటము ల ఉదృతి వలన సముద్రము లోకి కొట్టుకు పోయెను . ఆతడిని పంచజనుడు అను దనుజుడు మింగగా ఆ దనుజుది శరీరము నందున్న శంకము లోకి గురు పుత్రుడు ప్రవేశించెను . బలరామ కృష్ణులు తమ గురువు గారైన సాందీప మహర్షికి గురు దక్షణ గా ఆయన పుత్రుడుని తీసుకు రావాలని తలచి ,గురుపుత్రుడు స్నానానికి వెళ్ళిన సముద్ర తీరానికి వెళ్లి సముద్రుడిని అడుగగా సముద్రుడు పంచజనుడు గురు పుత్రుడిని మింగెనని చెప్పెను . అప్పుడు వారు పంచజనుడిని వెతికి అతడిని చంపి అతడి శరీరమును చీల్చగా శంఖము లభించెను . అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ శంఖమును తీసుకుని యమపురికి వెళ్లి అక్కడ ఆ శంఖమును ఉదేను . ఆ శబ్దమునకు యముడు అదిరిపడి వచ్చి శ్రీ కృష్ణుని చూసి వచ్చినపని తెలుపమని కోరగా శ్రీ కృష్ణుడు వచ్చిన పనిని తెలిపెను అప్పుడు యముడు గురు పుత్రుడిని శ్రీ కృష్ణుడికి అప్పగించెను . శ్రీ కృష్ణుడు అతడిని గురువు గారికి అప్పగించెను . పంచజన్యుడి శరీరం లో దొరికిన శంఖమును ఆ నాటి నుండి తాను ధరించెను . 

   ధర్మరాజు పాండవులలో అగ్రజుడు , ధర్మపుత్రుడు . యుధిస్ఠిరుడు అని ఆయనకు నామాంతరములు . ఆయన చేతిలోని శంఖమునకు " అనంత విజయ" అని పేరు . అంటే అంతులేని భటులను జయించేదని అర్ధము . అర్జునిని చేతిలోఉన్న శంఖమునకు " దేవదత్తము అని పేరు . భీముని శంఖము " పౌండ్రము " నకులుని శంఖము " సుఘోషము " అని పేరు .సహదేవుని శంఖము పేరు " మణి పుష్పకము " అని పేరు . కురుక్షేత్ర యుద్ధము లో అందరూ తమతమ శంఖములను పూరించినారు . ఐదుగురి చేతులలో ఐదు శంఖాలు . శ్రీకృష్ణ పరమాత్మ ఆరవవాడు ... ఆయన శంఖము పాంచజన్యము . . . ఈ ఐదుగురి శంఖములతో సమానము పాంచజన్యము .

చేపలవలె నీటిలో ఉండే ప్రాణి శంఖము ఆ ప్రాణి శంఖము లో ఉన్నపుడు కదులుతూ ఉంటుంది . మనకు పైన చర్మము లోన మాంసము , ఎముకలూ ఉండగా శంఖమునకు బయట అస్థి లోపల మాంసము ఉంటుంది . సముద్రములో ఉన్న ' పంచజనమనే ' శంఖమును బయటికి తెచ్చి భగవంతుడు తన యుద్ధ ఘోషకు ఉపయోగించాడు . పంచజనునకు సబంధించీంది కనుక దానికి " పాంచజన్యము " అని పేరు . అందరూ వారి వారి శంఖములను యూద్ధప్రారంభ సూచకముగా ఆనాడు పూరించేవారు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది