సముద్రం మింగేస్తుందని భయపడితే, పడవ పుట్టేదే కాదు. ఇది నేను చేయగలనా?మునిగిపోతానేమో!...అనిపించినప్పుడల్లా, మొదటిసారి నీటిలో తేలిన పడవ అడుగుని గుర్తుతెచ్చుకో. ఆకాశం తోసేస్తుందని ప్రయత్నించడం ఆపితే, విమానం ఎగిసేదే కాదు. ఇది నా వల్ల అవుతుందా? పడిపోతానేమో!...అని యపడినప్పుడల్లా, మొదటిసారి గాలిని చీలుస్తూ ముందుకు దూసుకుపోయిన విమానపు రెక్క అంచుని గుర్తుతెచ్చుకో.
ఆలోచించి 'అర్థం అయ్యింది లే!' అని వదిలేయకు. ఆచరించి చూడు. నీ మెదడు లో వుండే ఆలోచన ఎంత అద్భుతమైందైనా ప్రపంచానికి అనవసరం. ఎంత చిన్నదైనా ఆచరణే దానికి అవసరం. సాయం చేద్దాం అనేది మథర్ తెరెస్సా ఆలోచన కాదు, ఆచరణ. భార్య జ్ఞాపకాన్ని చరిత్రలో శాశ్వతం చేద్దాం అనేది షాజహాన్ ఆలోచన కాదు, ఆచరణ. ఆలోచన అంకె. ఆచరణ సంతకం. అంకె ఎవడు రాసినా ఒకటే. సంతకం మాత్రం పెట్టినవాడికే సొంతం. ఆలోచన మంత్రమైతే, ఆచరణ యజ్ఞం.
దేవతలు దయ తలుస్తారో లేదో తరువాత సంగతి. నిన్ను నువ్వు కాల్చుకొనైనా, ముందు యజ్ఞం పూర్తి చేయి. ప్రచండ శంఖమైనా పూరించకపోతే శవంతో సమానం.
శని ఆదివారాలూ, అమావాస్య పౌర్ణమిలు వస్తూ పోతూ వుంటాయి. లే. చిన్న చిన్న నీ ఆలోచనలని ఆచరణలో పెట్టు. చరిత్రలో అంకెలు చాలా వున్నాయి. సంతకాలు కావాలి. అది నువ్వే అవ్వు!
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About