జనరల్ క్నోలెడ్జ్ టుడే

*1⃣ ప్రజెంటేషన్ ఆఫ్ విజిటర్స్ అవార్డ్ – 2017కు ఎంపికైన తెలుగు వ్యక్తి ఎవరు..?*

✅ *పాండు రంగారావు (తెలంగాణలోని మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన పాండురంగారావు పంక్చర్ కాని ట్యూబ్‌లెస్ టైర్‌ను తయారు చేశారు. అలాగే సులభంగా విద్యుత్ స్తంభాలను ఎక్కేందుకు క్లచ్చర్స్ ‌ను తయారు చేశారు. ఇందుకు గాను రాష్ట్రపతి భవన్ ఆయనను ప్రజెంటేషన్ ఆఫ్ విజిటర్స్ అవార్డుకు ఎంపిక చేసింది)*

*2⃣ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఇటీవల ఏ ప్రాంతంలో దక్షిణాసియా శిక్షణ మరియు సాంకేతిక సహాయ శాఖను ఏర్పాటు చేసింది..?*

✅ *న్యూఢిల్లీ (దక్షిణాసియా శిక్షణ మరియు సాంకేతిక సహాయ శాఖలో సభ్య దేశాలుగా భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ఉంటాయి. ఈ దేశాల్లో ఆర్థిక, మానవ వనరుల అభివృద్ధి కోసం ఈ శాఖ సహాయం చేస్తుంది)*

*3⃣ ఆఫ్గనిస్తాన్ ఫ్యూచర్ (ఆఫ్గనిస్తాన్ భవిష్యత్తు) పేరుతో రష్యాలో జరగనున్న సమావేశానికి హాజరవుతున్న దేశం ఏది..?*

✅ *భారత్ (ఈ సమావేశం రష్యా ప్రెసిడెంట్ వ్లాద్‌మిర్ పుతిన్ అధ్యక్షతన జరగనుంది. దీనికి భారత్‌తో పాటు చైనా, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలు హాజరుకానున్నాయి)*

*4⃣ కొబ్రా గోల్డ్ మిలటరీ విన్యాసాలు – 2017ను నిర్వహించిన దేశం ఏది..?*

✅ *థాయ్‌లాండ్ (36వ కోబ్రా గోల్డ్ మిలటరీ విన్యాసాలను థాయ్‌లాండ్, అమెరికా సంయుక్తంగా నిర్వహించాయి)*

*5⃣ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరోస్పేస్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సంస్థ..?*

✅ *ఎయిర్ బస్ (తెలంగాణ ప్రభుత్వం, జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థతో కలిసి ఎయిర్‌బస్ ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది)*

*6⃣ ఇటీవల ఏ రాష్ట్రంలో కాలిమ్ పోంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు..?*

✅ *పశ్చిమ బెంగాల్ (పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాను విభజించి కాలిమ్ పొంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా అభివృద్ధి కోసం రూ.220 కోట్లతో కాలిమ్ పోంగ్ నుంచి సిక్కింకు రహదారిని నిర్మించనున్నారు)*

*7⃣ ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ (ఐపీసీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆన్‌లైన్ షాపింగ్‌లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది..?*

✅ *చైనా (ఈ నివేదిక ప్రకారం చైనాలో వారానికి 36 శాతం మంది కనీసం ఒక్కసారైనా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. అమెరికా 16 శాతం, జర్మనీ 15 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి)*

*8⃣ ఇస్రో ఇటీవల ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపింది..?*

✅ *పీఎస్‌ఎల్‌వీ సీ-37 (ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇందులో మూడు ఉపగ్రహాలు భారత్‌వి కాగా 96 శాటిలైట్స్ అమెరికాకు చెందినవి. ఇజ్రాయెల్, నెదర్లాండ్, ఖజకిస్తాన్, స్విట్జర్లాండ్, యూఏఈలకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి)*

*9⃣ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2017 ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశం ఏది..?*

✅ *చైనా (అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశాల జాబితాలో చైనా తర్వాత భారత్ ఉంది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2015లో వాయు కాలుష్యం వల్ల 1.1 మిలియన్ ప్రజలు చనిపోయారు. హెల్త్ ఎఫెక్ట్ ఇనిస్టిట్యూట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేటర్స్ అండ్ ఎవల్యూషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి)*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది