ఈ చిట్కాలు పాటిస్తే “అతి దాహం” సమస్య వెంటనే తీరుతుంది..! ఆ చిట్కాలు ఏమిటంటే..?
మధుమేహం ఉన్నవారికి సహజంగా విపరీతమైన ఆకలితోపాటు దాహం కూడా అవుతూ ఉంటుంది. ఇవి వారిలో సహజంగా కనిపించే లక్షణాలే. అయితే మధుమేహం లేని వారిలో కూడా ఒక్కోసారి విపరీతమైన దాహం అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది. వారికి డయాబెటిస్ ఉండకున్నా ముఖ్యంగా వేసవిలో తీవ్రమైన దాహానికి లోనవుతుంటారు. ఎంత నీరు తాగినా వారు సంతృప్తి చెందరు. చల్లని నీరు తాగితేనే కొంత తృఫ్తి చెందుతారు. అయితే శరీరంలో ఎక్కువ మొత్తంలో నీరు వెళ్లిపోవడం మూలంగానే ఇలా జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మరి ఈ సమస్యను తగ్గించుకోలేమా..? అంటే తగ్గించుకోవచ్చు..! అందుకు కింద ఇచ్చిన సూచనలు పాటించాలి. అవేమిటంటే…
1. ఒక టీస్పూన్ మంచి గంధాన్ని, రెండు టీస్పూన్ల ఉసిరి రసాన్నీ, రెండు టీస్పూన్ల తేనె కలిపి తాగిస్తే దాహంతో పాటు వాంతులు కూడా తగ్గుతాయి.
2. గ్లాసు చల్లని నీటిలో నాలుగు చెంచాల పంచదార, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం కలిపి తాగితే దాహం తగ్గుతుంది.
3. మేడి పండ్ల రసంలో చక్కెర కలిపి తాగితే అతిదాహం తగ్గుతుంది.
4. సుగంధి పాల కషాయంలో సమంగా చక్కెర కలిపి తేనె పాకంగా వండిన దానికి సగం నీరు కలిపి తాగితే వేసవి తాపం, దాహం తగ్గిపోతాయి.
5. వేసవి ఎండలో అతిగా తిరగడం వల్ల ఏర్పడిన అతి దాహంతో బాధపడే వారికి వరి బియ్యం వండి వార్చిన గంజిలో తెలకపిండిని మెత్తగా నూరి శరీరానికి రాస్తే దాహం అతి త్వరగా తగ్గిపోతుంది.
6. దానిమ్మ పండ్ల రసానికి సమంగా చక్కెర కలిపి తేనె పాకంగా వండి రెండు టీ స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది.
7. ధనియాల కషాయంలో చక్కెర, తేనె కలిపి తాగితే దాహం తగ్గుతుంది.
8. వేసవి కాలం దాహం అనిపించినపుడు గ్లాసు చల్లని నీటిలో అర చెంచాడు ఉప్పు కలిపి తాగాలి